rana daggubati new movie with rajinikanth director p ranjith
rana daggubati new movie with rajinikanth director p ranjith

అన్ని సినీ పరిశ్రమల్లో ఈ మధ్య మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. అయితే తాజాగా కోలీవుడ్ దర్శకుడు పా.రంజిత్‌ కూడా మల్టీస్టారర్‌ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పా.రంజిత్‌ సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా కబాలి, కాలా చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రాలు రజిని స్థాయి హిట్ అందుకోలేకపోయాయి. కానీ పా.రంజిత్‌ కి మాత్రం ఇంకా బాగానే క్రేజ్ ఉంది. కాగా ప్రస్తుతం పా.రంజిత్‌ హిందీలో ప్రముఖ స్వాతంత్య్ర పోరాటయోధుడు బిర్సా ముండా బయోపిక్‌ ను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారట.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుందట. అయితే తాజాగా కోలీవుడ్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో రానా కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆర్య – రానా కాంబినేషన్ లో కూడా మరో మల్టీస్టారర్‌ రాబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మొత్తానికి రానా వరుసగా మల్టీస్టారర్స్ తో రాబోతున్నాడు.