దొంగ‌ల రాజ్యంలో… దోపిడీ రాజ్యంలో: రానా విరాట ప‌ర్వం టీజ‌ర్ విడుద‌ల

327
Rana Daggubati's First Glimpse From ViraataParvam

యాక్ట‌ర్ రానా ప‌లు భాష‌లలో ప్ర‌తిష్టాత్మ‌క సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నాడు. ప్ర‌స్తుతం తెలుగులో విరాట ప‌ర్వం సినిమా చేస్తుండ‌గా, వివిధ భాష‌ల‌లో డిఫ‌రెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. అయితే ఈ రోజు రానా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న పోస్ట‌ర్‌తో పాటు వీడియో విడుద‌ల చేశారు. కామ్రేడ్ ర‌వి అన్న పాత్ర‌లో రానాని ప‌రిచ‌యం చేస్తూ సాగిన టీజ‌ర్ ఇది. 1990 లో జ‌రిగిన కొన్ని వాస్త‌వ సంఘ‌ట‌న‌ల‌కు తెర‌రూపం ఇచ్చామ‌ని చిత్ర‌బృందం టీజ‌ర్లో స్ప‌ష్టం చేసింది.

ఈ దేశం ముందు ఓ ప్ర‌శ్న‌గా నిల‌బ‌డ్డ జీవితం అత‌నిది స‌త్యాన్వేష‌ణ‌లో నెత్తురోడిన హృద‌యం అత‌నిది… డాక్ట‌ర్ ర‌విశంక‌ర్ అలియాస్ ర‌వి అన్న‌… అంటూ రానా పాత్ర‌ని ప‌రిచ‌యం చేస్తూ ఈ టీజ‌ర్ ని క‌ట్ చేశారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం.. దొంగ‌ల రాజ్యం – దోపిడీ రాజ్యం అంటూ కొన్ని నినాదాలు వినిపించాయి. దాన్ని బ‌ట్టి ఈ వ్య‌వ‌స్థ‌పై తిరుగుబాటు చేసిన ఓ ఉద్య‌మం గురించి ఈ క‌థలో ప్ర‌స్తావించ‌బోతున్నార‌న్న విష‌యం స్స‌ష్టంగా అర్థం అవుతోంది. ఇక రానా కామ్రేడ్ లుక్ అదిరింది.

ఎస్‌.ఎల్‌.వి సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు. వేణు ఊడుగుల దర్శకత్వం వ‌హిస్తున్నారు. సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక‌గా న‌టిస్తుంది. నివేదా పెతురాజ్, ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీరావ్‌, సాయిచంద్‌, బెనర్జీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.