‘విరాట పర్వం’ రిలీజ్ డేట్ ఖరారు

0
273
Rana Daggubati Sai Pallavi Virata Parvam Release date confirmed.

రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘విరాటపర్వం’. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “రివల్యూషన్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ లవ్” అనేది ట్యాగ్‌లైన్‌. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న ‘విరాటపర్వం’ను ఏప్రిల్ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటి వరకూ కనిపించని పాత్రల్లో రానా, సాయిపల్లవి నటిస్తున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్‌ను నిర్మాణ సంస్థలు తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా షేర్ చేశాయి. ఆ పోస్టర్‌లో నక్సలైట్ దుస్తుల్లో గన్ పట్టుకొని నడచుకుంటూ వెళ్తున్న రానా కనిపిస్తున్నాడు. రానా బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్‌, సంక్రాంతి పర్వదినాన రిలీజ్ చేసిన రానా-సాయిపల్లవి జంట పోస్టర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

Sai Pallavi Virataparvam Release date

మిగతా ముఖ్య పాత్రల్లో ప్రియమణి, నందితా దాస్‌, నివేదా పేతురాజ్‌, నవీన్ చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీ రావ్‌, సాయిచంద్ కనిపించనున్నారు. నిజానికి ఇవన్నీ ‘విరాటపర్వం’పై అంచనాలను పెంచి, ఆడియెన్స్‌లో, ఇండస్ట్రీ వర్గాల్లో క్రేజ్ తీసుకొచ్చాయి.

Previous articleవాక్సిన్ కు భయపడకండి అంటున్న ఉపాసన కొణిదెల
Next articleఖిలాడిలో విలన్ పాత్ర వెయ్యబోతున్నఅర్జున్ సార్జా