ఇక వరుస సర్‌ప్రైజ్‌లతో రానా సందడి..!

0
1976
Rana Daggubati Teaser from Pawan Kalyan Bheemla Nayak

Bheemla Nayak Rana Daggubati: పవర్‌ స్టార్‌ Pawan Kalyan- రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న చిత్రం ‘Bheemla Nayak’. మలయాళం హిట్‌ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’కు తెలుగు రీమేక్‌ ఇది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన ఫస్ట్‌లుక్, ప్రచారా చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

అయితే రానాకి సంబంధించి ఒక్క పోస్టర్, వీడియో కూడా విడుదల చేయకపోవడంతో దగ్గుబాటి ఫ్యాన్స్‌ విమర్శలు గుప్పించడంతో చిత్ర బృందం క్లారిటీ ఇస్తూ.. . రానా పాత్రకు సంబంధించిన టీజర్‌ను త్వరలో విడుదల చేస్తాం.. కాస్త ఓపిక పట్టండి అని ప్రకటించింది. తాజా బజ్ ప్రకారం సెప్టెంబర్ 17 న డేనియల్ శేఖర్‌గా రానాను పరిచయం చేస్తూ టీజర్‌ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

అయితే దీనికి సంబంధించి చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా ప్రధాన పోషిస్తున్నారు. టాలీవుడ్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా 2022 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Rana Daggubati Teaser from Pawan Kalyan Bheemla Nayak

ఇప్పటికే విడుదలైన “భీమ్లా నాయక్” టీజర్ ఇంటర్నెట్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే. బిజు పాత్రలో పవన్ .. పృథ్వీ పాత్రను రానా పోషిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దీనికి స్క్రీన్ ప్లే -మాటలు రాశారు. తమన్ సంగీతం అందించాడు.