Rana Daggubati to work with director Milind Rau next!

రానా (Rana Daggubati) వరుసగా ఒకదాని వెంట ఒకటిగా సినిమాలు అంగీకరిస్తున్నాడు. ఇప్పటికే అరణ్య (హాథీ మేరా సాథీ).. హిరణ్య కశిప లాంటి భారీ చిత్రాల్లో నటిస్తున్న అతడు `విరాట పర్వం` చిత్రాన్ని ఆల్మోస్ట్ పూర్తి చేశాడు. తాజాగా మరో దర్శకుడికి రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.

ఈ సినిమాకి బాలీవుడ్ దర్శకుడు మిలింద్ రౌ దర్శకత్వం వహించబోతునట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మిలింద్ ఇప్పటికే రానాకు కథను కూడా వివరించాడని.. రానాకి కథ బాగా నచ్చిందని తెలుస్తోంది. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబుతో కలిసి గోపీనాథ్ ఆచంట నిర్మించనున్నారు. ఈ సినిమా అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే పక్కా యాక్షన్ అడ్వెంచర్ అట.

ఇక ఇటీవలే రానా దగ్గుబాటి వివాహం మిహికా బజాజ్ తో హైదరాబాద్ లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. పలువురు కీలక బంధువులు మరియు సినీ పెద్దలు సమక్షంలో వీరి వివాహం జరిగింది.