అత్తారింట్లో దగ్గుబాటి వారసుడి హంగామా..!

0
405
Rana- Miheeka Bajaj Dussehra Celebrations At Hyderabad

Rana Daggubati Miheeka Bajaj: రానా దగ్గుబాటి ఈ మధ్య పెళ్లి చేసుకున్నాడు. తను మెచ్చిన ప్రేయసి మిహీకా బజాజ్‌ను భార్యగా తన ఇంటికి ఆహ్వానించాడు దగ్గుబాటి వారసుడు. పెళ్ళి తర్వాత కొన్ని రోజుల వరకు ఇక్కడే ఉన్నారు రానా దంపతులు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫొటోలో రానా అత్తయ్య బంటీ బజాజ్‌ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేయడంతో నెట్టింట వైరల్ అవుతున్నాయి.

పెళ్లైన తర్వాత ఇదే ఆ నవ దంపతుల తొలి దసరా. దీంతో అత్తారింట్లో చేరి తెగ హంగామా చేశారట రానా. పర్పుల్ కలర్ శారీలో ట్రెడీషనల్ లుక్‌తో మిహీక మెరిసిపోతుంటే.. రానా మాత్రం సింపుల్‌గా వైట్ కలర్ కుర్తా వేసుకుని కూల్ లుక్‌లో దర్శనమిచ్చాడు. అత్త మామలతో కలిసి ఈ ఫోటో దిగాడు రానా. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి.

ఇక రానా కెరీర్ విషయానికి వస్తే.. పెళ్లికి ముందే కమిటైన సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు ”అరణ్య, హిరణ్యకశ్యప, విరాట పర్వం” సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలను లైన్‌లో పెట్టారు ఈ ప్యాన్ ఇండియా స్టార్. త్వరలోనే మళ్లీ షూటింగ్స్‌తో బిజీ కానున్నాడు రానా .