Homeసినిమా వార్తలు1945 Trailer: సంక్రాంతి బరిలోకి రానా సినిమా.. !!

1945 Trailer: సంక్రాంతి బరిలోకి రానా సినిమా.. !!

Rana 1945 Movie Trailer: సంక్రాంతికి రిలీజ్ డేట్ ప్రకటించిన ఒక్క సినిమా వాయిదా పడడం జరిగింది. RRR అలాగే రాధే శ్యామ్ (Radhe Shyam) మూవీలు COVID కారణంగా వాయిదా వేయడం జరిగింది. దీనితో చిన్న బడ్జెట్ సినిమాలు ఒక్కొక్కటి రిలీజ్ డేట్ ని ప్రకటించారు. వాటిలో రాణా దగ్గుబాటి (Rana Daggubati) చేసిన 1945 సినిమా కూడా అ రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది.

1945 సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి మూడు సంవత్సరాలు అవుతోంది. అలాగే వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన విరాట పర్వం సినిమా విడుదల కోసం గత ఐదు నెలలుగా ఎదురుచూస్తోంది. ఇప్పుడు రానా (Rana) నటించిన 1945 సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఎట్టకేలకు జనవరి 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమా సంబంధించిన ట్రైలర్ ను చూస్తే, 1945 అనేది భారతదేశ స్వాతంత్ర్య పోరాటం చుట్టూ తిరిగే పీరియడ్-డ్రామా. ఈ చిత్రంలో రానా సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీలో పనిచేసే సైనికుడి పాత్రలో కనిపించాడు. రెజీనా కసాండ్రా కథానాయికగా నటించగా, నాజర్, సత్యరాజ్, ఆర్జే బాలాజీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Rana’s 1945 To Finally releasing on January 7th
Rana’s 1945 To Finally releasing on January 7th

కె ప్రొడక్షన్‌కు చెందిన ఎస్ఎన్ రాజ రాజన్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. నిర్మాత మరియు రానా మధ్య వచ్చిన విభేదాల కారణంగా 2019లో ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు కానీ త్వరలో అభిమానులకు విజువల్ ట్రీట్ ఇవ్వడానికి విషయాలు వెనుక సీటు తీసుకున్నట్లు కనిపిస్తోంది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి స్కోర్ అందించగా, సత్య పొన్మార్ సినిమాటోగ్రఫీని అందించారు.

 

Related Articles

Telugu Articles

Movie Articles