Rana Naidu Web Series Review: దగ్గుబాటి వెంకటేష్ (Venkatesh) మరియు రానా కొత్త వెబ్ సిరీస్ రానా నాయుడు నిన్న OTTలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది ఫ్యామిలీ ఆడియన్స్ తో కూర్చొని చూడవచ్చా లేదా అంటే వచ్చే సమాధానం ఒక్కటే.. ప్రమోషన్ లో చెప్పిన విధంగా ఫ్యామిలీతో కూర్చొని చూసే వెబ్ సిరీస్ కాదు ఇది.
Rana Naidu Web Series Review: ఈ రానా నాయుడు వెబ్ సిరీస్ ని మొత్తం 10 ఎపిసోడ్లు కింద విడుదల చేయడం జరిగింది.. అయితే ప్రతి ఎపిసోడ్ లోనూ బూతులు అలాగే ప్రతి పది నిమిషాలకి ఒక సెక్స్ సీన్ అనేది మేకర్స్ పెట్టారు. ఇలాంటి అడల్ట్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లో వెంకటేష్ (Venkatesh) నటించినందుకు ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు.
అలాగే వెంకటేష్‌పై (Venkatesh) ప్రేక్షకుల తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇది వెంకటేష్ (Venkatesh) చేసిన అతి పెద్ద తప్పు అని కూడా కొందరు అంటున్నారు. వెంకటేష్అలాగే రానా (Rana) మొట్టమొదటిసారిగా కలిసి నటించడంతో రానా నాయుడు (Rana Naidu) వెబ్ సిరీస్ పై చాలా అంచనాలు ఉన్నాయి కానీ వెబ్ సిరీస్‌లో కంటెంట్ వారీగా ప్రత్యేకమైనది ఏదీ లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు.
అలాగే వెంకటేష్ నటనకు స్కోప్ అంతగా లేదని, ఆయన ఈ పాత్రను అంగీకరించడానికి కారణమేమిటని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ తరహా అడల్ట్ కంటెంట్‌ని వెంకటేష్ ప్రోత్సహిస్తాడని ఎవరూ ఊహించని విధంగా ప్రేక్షకులు వెంకటేష్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకంటే వెంకటేష్ అంటేనే ఫ్యామిలీ హీరో కానీ రానా నాయుడు (Rana Naidu) వెబ్ సిరీస్ లో రచ్చ రచ్చ చేశాడు.
ఇక రానా నాయుడు (Rana Naidu) వెబ్ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే, వెంకటేష్ తండ్రి పాత్రలో నటించగా రానా కొడుకు పాత్రను పోషించారు. చేయని తప్పుకు జైలుకు వెళ్లిన తండ్రి అంటే రానాకి అసలు ఏమాత్రం ఇష్టం ఉండదు కానీ ఎలా రానా అని ఆయన కుటుంబాన్ని వెంకటేష్ కలిశాడు.మరోవైపు రానా తన సమస్యల్ని ఎలా పరిష్కరించుకున్నాడు.. వీళ్లిద్దరి మధ్య గొడవ ఎక్కడిదాకా వెళ్లింది.. వారిలో ఒకరిగా మారాడని కథావంశంతో ఈ వెబ్ సిరీస్ రూపొందించారు.