దగ్గుబాటి రానా చేతుల మీదుగా “పవర్ ప్లే” మోషన్ పోస్టర్ రిలీజ్

157
Rana Daggubati, Raj Tarun, power play motion poster

యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా రాబోతున్న న్యూ డిఫ‌రెంట్ థ్రిల్లింగ్ మూవీ ‘పవర్ ప్లే’. కొండా విజ‌య్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. శ్రీ‌మ‌తి ప‌ద్మ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రై.లి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రాబోతున్న ఈ సినిమాను మ‌హిద‌ర్‌, దేవేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హీరో రానా ద‌గ్గుబాటి ఈ పవర్ ప్లే మోషన్ పోస్టర్ విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌కి బెస్ట్ విషెస్ తెలిపారు.

ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు విజ‌య్ కుమార్ కొండా మాట్లాడుతూ.. ”మా పవర్ ప్లే మూవీ ఫ‌స్ట్‌లుక్, మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేసిన రానా గారికి ద‌న్య‌వాదాలు. పోస్ట‌ర్‌లో రాజ్ త‌రుణ్ లుక్ ఎంత డిఫ‌రెంట్‌గా అనిపిస్తుందో.. సినిమా కూడా అంతే డిఫ‌రెంట్‌గా ఉంటుంది. నేను, రాజ్ త‌రుణ్ ఇంత‌వ‌ర‌కూ చేయ‌ని ఒక కొత్త జోన‌ర్‌లో భిన్న‌మైన థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీ ఉండబోతోంది” అన్నారు.

హీరో రాజ్ త‌రుణ్ మాట్లాడుతూ.. “గతంలో డైరెక్టర్ విజ‌య్ కుమార్‌తో `ఒరేయ్ బుజ్జిగా` లాంటి మంచి ఎంట‌ర్‌టైన‌ర్ చేశాను. ఆ సినిమా మంచి రిజల్ట్ రాబట్టింది. ఇప్పుడు ఓ స‌రికొత్త జోన‌ర్‌లో డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్ చేస్తున్నాను. ఇదో కొత్త ఎక్స్‌పీరియ‌న్స్‌.. ఆడియ‌న్స్‌కి కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది” అన్నారు. ఇక అందరి అంచ‌నాల‌ను అందుకునేలా ఈ మూవీ ఉంటుందని, థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లోనే ఒక ట్రెండ్ సెట్ట‌ర్ అవుతుందని నిర్మాతలు తెలిపారు.

రాజ్ త‌రుణ్‌, హేమ‌ల్ ఇంగ్లే, పూర్ణ‌, మ‌ధు నంద‌న్‌, అజ‌య్‌, కోటా శ్రీ‌నివాస‌రావు, రాజా ర‌వీంద్ర‌, ధ‌న్‌రాజ్‌, కేద‌రి శంక‌ర్‌, టిల్లు వేణు, భూపాల్‌, అప్పాజీ, ర‌వివ‌ర్మ‌, సంధ్య‌ జ‌న‌క్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి
క‌థ‌-మాట‌లు: న‌ంధ్యాల ర‌వి,
సినిమాటోగ్ర‌ఫి: ఐ. ఆండ్రూ,
సంగీతం: సురేష్ బొబ్బిలి‌,
ఎడిటింగ్: ప‌్ర‌వీణ్ పూడి,
ఆర్ట్‌: శివ‌,
ఫైట్స్‌: `రియ‌ల్` స‌తీష్‌,
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: బి.వి సుబ్బారావు,
కో- డైరెక్ట‌ర్: వేణు కురపాటి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ప‌ల‌ప‌ర్తి అనంత్ సాయి,
స‌మ‌ర్ప‌ణ‌: శ్రీ‌మ‌తి ప‌ద్మ‌,
నిర్మాత‌లు: మ‌హిద‌ర్‌, దేవేష్‌,
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: విజ‌య్ కుమార్ కొండా.