గత యేడాది ఫిబ్రవరి 21న విడుదలైన ‘భీష్మ’ సినిమా నితిన్ కు ఓ మెమొరబుల్ హిట్ ను అందించింది. దాంతో ఆ యేడాది లాక్ డౌన్ కారణంగా మరే సినిమా విడుదల కాకపోయినా నితిన్ కు ఫర్క్ పడలేదు. అయితే… మొన్న ఫిబ్రవరి 26న వచ్చిన ‘చెక్’ మూవీ మాత్రం ఈ యంగ్ హీరోను కాస్తంత నిరాశకు గురి చేసింది.
చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ రెగ్యులర్ ఫిల్మ్ గోయర్స్ ను ఎంటర్ టైన్ చేయలేకపోయింది. దాంతో ఇప్పుడు నితిన్ తన ఆశలన్నీ ‘రంగ్ దే’ మీదే పెట్టుకున్నాడు.
విశేషం ఏమంటే… ‘భీష్మ’ చిత్రాన్ని నిర్మించిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థే దీనిని నిర్మించడం. ఈ సినిమా ప్రారంభం నుండి దర్శకుడు వెంకీ అట్లూరితో పాటు నిర్మాత సూర్యదేవర నాగవంశీ సైతం ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. పైగా దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ట్యూన్స్ సినిమా మీద బజ్ ను మరింతగా పెంచేశాయి.
‘ఉప్పెన’ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసిన దేవిశ్రీ ఈ సినిమాకూ సూపర్ ట్యూన్స్ అందించాడు. దాంతో ఈసారి కాస్తంత గట్టిగానే ‘రంగ్ దే’ను ప్రమోట్ చేయాలని నిర్మాత నాగవంశీ భావిస్తున్నాడట.
అందులో భాగంగా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ రీజన్స్ లో ప్రీ-రిలీజ్ వేడుకను ప్లాన్ చేశారట. తెలంగాణలో హైదరాబాద్ లోనూ, ఆంధ్రకు సంబంధించిన వేడుకను రాజమండ్రిలోనూ, రాయలసీమలోని కర్నూల్ లోనూ జరుపబోతున్నారట.
ఇందులో మొదటి కార్యక్రమంగా ట్రైలర్ రిలీజ్ ను ఈరోజు కర్నూల్ ఎస్.టి.బి.సి. కాలేజ్ లో జరుగుతుంది అందులో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేసారు. మొత్తానికి నితిన్, కీర్తి సురేశ్ ఫస్ట్ కాంబినేషన్ మూవీ ‘రంగ్ దే’ మీద వారి అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.