మహేష్ బాబు బిగ్ బ్రదర్.. రణ్‌వీర్‌ లవ్..!

0
443
Ranveer Singh all praises on working with Superstar Mahesh Babu shares photo with him

వెండితెరపై సూపర్ స్టార్ గా ఎంతగానో క్రేజ్ అందుకున్న మహేష్ అంటే అందరికి ఇష్టమే. అయితే అంత స్టార్ డమ్ ఉన్నా కూడా మహేష్ మాత్రం అందరితో సమానంగా ఉంటాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. థమ్స్ అప్ బ్రాండ్ అంబాసిడర్‌గా టాప్ ఫిల్మ్ సెలబ్రిటీలే ఉంటూ వస్తున్నారు. నార్త్‌లో సల్మాన్ ఖాన్‌, అక్షయ్ కుమార్ లాంటి వాళ్లు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించగా, ఇప్పుడు రణవీర్ సింగ్‌కు ఆ బాధ్యతలు లభించాయి. అయితే తెలుగు ప్రాంతానికి వచ్చేసరికి చాలా కాలంగా మహేశ్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతూ వస్తున్నాడు.

రణవీర్ సింగ్ మహేష్ బాబుతో కలిసి చాలా సార్లు కమర్షియల్ యాడ్స్ షూట్స్ లలో కలిసి పని చేశారు. మహేశ్‌తో కలిసి పనిచేయడం ఎలా ఉందో, అతను తనకు ఎలా అనిపించాడో తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పంచుకున్నాడు రణవీర్‌. మహేష్ బాబు ఒక జెంటిల్ మెన్. ఆయనతో కలిసి పని చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఎల్లప్పుడూ సహకరించే మంచి మనిషి. మేము ఎప్పుడు కలుసుకున్నా కూడా చాలా సుసప్పనంగా ఉంటుంది. బిగ్ బ్రదర్ మహేష్ గారికి లవ్ అలాగే రెస్పెక్ట్ ఎప్పటికి ఉంటుందని రణ్ వీర్.. సోషల్ మీడియా ద్వారా ఒక స్పెషల్ ఫొటోను కూడా షేర్ చేసుకున్నారు. అది.ఇప్పుడు ఇంటర్నెట్ వరల్డ్ లో వైరల్ గా మారింది.

మహేశ్ సైతం రణవీర్‌తో కలిసి పనిచేయడం గొప్పగా అనిపించిందని చెప్పాడు. తన ఇన్‌స్టా స్టోరీలో సేమ్ పిక్చర్‌ను షేర్ చేసిన మహేశ్‌, “It was great working with you brother Ranveer Singh. The feeling is mutual” అంటూ క్యాప్షన్ పెట్టాడు.

 

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh)

 

Previous articleసింగర్ సునీత – రామ్ మ్యారేజ్ డేట్ ఫిక్స్!
Next articleRED Film సెన్సార్ పూర్తి.. సంక్రాంతి బరిలో రామ్ పోతినేని