రష్మీ గౌతమ్ లుక్ అదుర్స్.. బొమ్మ బ్లాక్ బస్టర్

0
787
Rashmi Gautam Look Adurs in Bomma blockbuster
Rashmi Gautam Look Adurs in Bomma blockbuster

Rashmi Gautam : వెండితెరపై ఆచితూచి పాత్రలు ఎంచుకుంటున్న రష్మీ గౌతమ్ బొమ్మ బ్లాక్‌బస్టర్ (Bomma Block Buster) అనే సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు మేకర్స్. తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి రష్మి గౌతమ్ (Rashmi Gautam) గురించి సెపేరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. అంత పాపులర్ ఈ భామ. యాంకరింగ్ చేస్తూనే.. అడపా దడపా సినిమాలు చేస్తూ అందాలను కనువిందు చేస్తూ విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది.

బుల్లితెరపై వచ్చిన సక్సెస్ వెండితెరపై రాకపోయినా అదృష్టం పరీక్షించుకుంటూ విభిన్న పాత్రలు పోషిస్తూ వస్తోంది ఈ జబర్దస్త్ బ్యూటీ. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్ ఇస్తూ హంగామా చేస్తున్న రష్మీ.. తాజాగా తన లేటెస్ట్ మూవీ ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ తన లుక్ షేర్ చేసింది.

ఈ సినిమా విజయూభవ ఆర్ట్స్ పతాకంపై ప్రవీణ్ పగడాల, బోస్ బాబు నిడిమోలు, ఆనంద్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రాజ్ విరాఠ్ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ న‌టులు నందు, రష్మీ గౌతమ్‌ జంటగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇందులో తన క్యారెక్టర్ పేరు చెబుతూ తన లుక్ పోస్ట్ చేసి అట్రాక్ట్ చేసింది రష్మీ గౌతమ్.

Previous articleసురేందర్ రెడ్డి- అఖిల్ కాంబో సెట్ అఫీషియల్
Next articleచోట కే నాయుడు తమ్ముడి కేసులో మరో ట్విస్ట్‌..!