శంకర్ – రామ్ చరణ్ సినిమాలో కథానాయికగా రష్మిక

173
rashmika-as-the-heroine-in-shankar-ramcharan-movie
rashmika-as-the-heroine-in-shankar-ramcharan-movie

తమిళ దర్శకుడు శంకర్‌ సినిమాలో అవకాశం అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు అలాంటివి మరి. జెంటిల్‌మెన్‌’ ‘భారతీయుడు’ ‘అపరిచితుడు’లాంటి సినిమాలు భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోయే స్థాయిని సాధించాయి. తాజాగా టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సంబందించి ఓ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

పొలిటికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంగా తెరకెక్కనున్న చిత్రంలో కథానాయికగా రష్మిక మందన నటించనుందని వార్తలొస్తున్నాయి. చరణ్‌ – రష్మిక పేరును శంకర్‌, దిల్‌రాజులకు సూచించాడని చెప్పుకుంటున్నారు. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇది ఆ సంస్థకు 50వ చిత్రం.

ఇంకా పేరు పెట్టని ఈ సినిమాని 3డీ ఫార్మాట్‌లో చిత్రీకరించాలని దర్శకుడు శంకర్‌ యోచిస్తున్నాడట. మరో వైపు అనిరుధ్‌ని సంగీత దర్శకుడిగా తీసుకోవాలనే ఆలోచనలో శంకర్‌ ఉన్నాడనే వార్తలొస్తున్నాయి. రష్మిక దక్షిణాది చిత్రాలతో పాటు బాలీవుడ్‌లో సిద్ధార్థ మల్హోత్రా కథానాయకుడిగా నటిస్తోన్న ’మిషన్‌ మజ్ను’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇదిలా ఉంటే ఇది శంకర్‌కు 15వ చిత్రం కాగా చరణ్‌కు కూడా 15వ చిత్రమవుతుంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు.