‘సరిలేరు నీకెవ్వరు’ మూడో పాట: రష్మిక టిక్ టాక్ వీడియో

0
430

‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర ప్రమోషన్స్‌ను కొత్త పుంతలు తొక్కిస్తోంది చిత్ర యూనిట్. సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతికి రాబోతున్న సరిలేరు సినిమా పాటలని ప్రతి సోమవారం ఒక్కో పాటని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

‘సరిలేరు నీకెవ్వరు’ ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే టీజర్‌తో పాటు సరిలేరు నీకెవ్వరు టైటిల్ సాంగ్, మైండ్ బ్లాక్, సూర్యుడు చంద్రుడు సాంగ్స్‌ను విడుదల చేశారు. తాజాగా మరో సాంగ్ ప్రోమోను వినూత్నంగా విడుదల చేశారు. వచ్చే సోమవారంలో మూడోపాట #HeIsSoCute సాంగ్ రాబోతుంది.ఈ పాటని రస్మిక చేత ప్రమోట్ చేయిస్తున్నారు. ఈ పాటపై రస్మిక చేసిన టిక్ టాక్ వీడియో ఒకటి వదిలారు. తన వ్యక్తిగత టిక్ టాక్ యాప్ ద్వారా ఈ సాంగ్ ప్రోమోను విడుదల చేసింది రష్మిక. దేవి శ్రీ అందించిన రొమాంటిక్ సాంగ్‌కి క్యూట్ స్టెప్పులు వేస్తూ రచ్చ చేసింది రష్మి. ఆ వీడియో చాలా క్యూట్ గా ఉంది. ఆ వీడియోని మీరు ఓ సారి చూసేయండీ.. !

‘హి ఈజ్ సో క్యూట్.. హి ఈజ్ సో స్వీట్.. హి ఈజ్ సో హ్యాండ్సమ్’ అంటూ మహేష్ అందాన్ని తెగపొగిడేస్తూ తెగ డాన్స్ చేస్తుంది రష్మిక. ఈ సందర్భంగా పూర్తి సాంగ్‌ను డిసెంబరు 16 సాయంత్రం 05.04 గంటలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది రష్మిక.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here