సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో రష్మిక పేరు వినని వారు అంటూ ఎవరు ఉండరు. సినీ ప్రస్థానంలోకి అడుగుపెట్టిన 5 ఏళ్లలో రష్మిక నేషనల్ క్రష్ గా మారి అగ్ర హీరోలతో సినిమాలు చేస్తుంది. అలాగే తన అందం నటనతో కుర్రకారుని తన అభిమానులుగా మార్చుకుంటుంది సోషల్ మీడియాలోనే కాకుండా సినిమాల్లోనూ తన అందచందాలతో అలరిస్తుంది. ప్రస్తుతం రష్మిక చేతిలో పుష్ప 2 – యానిమల్ రెండు సినిమాలు ఉన్నాయి.
లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు ఈ రెండు సినిమాలు తర్వాత మరో క్రేజీ ప్రాజెక్టులో కూడా రష్మిక సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం చియాన్ విక్రమ్ అలాగే విజయ్ సేతుపతి అగ్ర హీరోల మల్టీస్టారర్ మూవీలో ఛాన్స్ కొట్టేసినట్టు సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. మలయాళ 2018 ఫేం దర్శకుడు జూడ్ ఆంథోని ఈ చిత్రాని తలకెక్కిస్తున్నారు. దర్శకుడు జూడ్ లిస్టులో ఇప్పటికే మలయాళం సినిమాలు వరుస భారీ విజయాలు సాధించారు.
ఇప్పుడు చియాన్ విక్రమ్- సేతుపతి లాంటి అగ్ర హీరోలతో భారీ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీకి రెడీ అయ్యారు. ఫ్యాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన కూడా బిజినెస్ పరంగా ఎంతో హైప్ ని పెంచుతుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్న రష్మిక ఈ సినిమాతో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్టు ని తన ఖాతాలో వేసుకో పోతుంది.

అయితే రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ కి రష్మికి-విజయ సేతుపతి పేర్లు ఇంకా ఖరారు కాలేదు. ఇద్దరు స్టార్లతో చర్చలు జరుగుతున్నాయి. అన్నీ కుదిరితే ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. దీన్ని లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.