రష్మిక బాలీవుడ్ ఎంట్రీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..!

327
Rashmika Mandanna Bollywood Debut with Mission Majnu movie

2018లో విడుదలైన ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన హీరోయిన్ రష్మిక మంధన. అదే ఏడాదిలో రష్మిక నటించిన గీతగోవిందం, దేవదాస్ అలాగే 2019లో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా బాక్సాఫీసు దగ్గర కాసులు వర్షం కురింపించాయి. ఈ ఏడాది `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` వంటి విజయాలను తన ఖాతాలో వేసుకుని టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది కన్నడ భామ రష్మికా మందన్న. ప్రస్తుతం తమిళంలోనూ సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె బాలీవుడ్ ఎంట్రీ కూడా ఫిక్సయింది.

తాజాగా తాను నటించనున్న సినిమా ఫస్ట్‏లుక్ పోస్టర్‏ను రష్మిక షేర్ చేసింది. ఈ మూవీలో బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ‘మిషన్ మజ్ను’ గా ఖరారు చేసింది చిత్రయూనిట్. తాజాగా ఈ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రకు జంటగా రష్మికను ఎంపికచేశారు.1970వ దశకంలో జరిగిన కోవర్ట్ ఆపరేషన్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో `రా` ఏజెంట్‌గా సిద్ధార్థ్ నటిస్తున్నాడు.

‘మిషన్ మజ్ను సినిమాలో నేను కూడా ఓ భాగమైనందుకు ఎంతో ఆనందిస్తున్నాను. ఈ మూవీతో కొత్త ప్రయాణం ప్రారంభమవుతుందని చెప్పడం నాకెంతో సంతోషంగా ఉంది. భారత్ రా ఏజెన్సీ పాకిస్తాన్‏లో చేపట్టిన అత్యంత సాహసోపేతమైన మిషన్ కథతో మిషన్ మజ్ను సినిమా తెరకెక్కుతుంది’ అని రష్కిక తెలిపింది. యాడ్ ఫిల్మ్ మేకర్ షంతాను బాచి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.