Rashmika Mandanna First Look Poster From Mahesh Babu Sarileru Neekevvaru Movie
Rashmika Mandanna First Look Poster From Mahesh Babu Sarileru Neekevvaru Movie

తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో మహేష్ బాబు – రష్మికలు సూపర్ రొమాంటిక్ మూడ్ లో ఉన్నారు.’సరిలేరు నీకెవ్వరు’ టీజర్ విడుదలైనప్పట్నుంచి సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ తో సహా అందరిదీ ఒకటే క్వశ్చన్ ‘హీరోయిన్ ఎక్కడ?’. ఆఖరికి మొన్నటివరకూ విడుదలైన రెండు పాటల్లో కూడా హీరోయిన్ ని ఎక్కడా కనీసం చూపించలేదు. దాంతో స్పెషల్ టీజర్ లేదా పోస్టర్ ఏమైనా రిలీజ్ చేస్తున్నారేమో అనుకున్నారు జనాలు.

తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో మహేష్ బాబు – రష్మికలు సూపర్ రొమాంటిక్ మూడ్ లో ఉన్నారు. మహేష్ ఒక చేత్తో రష్మికను స్టైల్ గా పట్టుకుని ఉంటే.. రష్మిక మల్లెతీగ తరహాలో మహేష్ ను అల్లుకు పోయి నవ్వుతూ ప్రేమగా మహేష్ కళ్ళలోకి సూటిగా చూస్తోంది. ఇదే పోస్టర్ లో రిలీజ్ డేట్ ను జనవరి 11 వ తారీఖు అని తెలిపారు. నిన్నమొన్నటివరకూ మహేష్ పక్కన రష్మిక ఎలా ఉంటుందో అని భయపడినవాళ్ళందరూ.. ఇప్పుడు ఇద్దరు పెయిర్ చూసి ‘బాగున్నారు’ అనుకొంటున్నారు. కానీ ఈమధ్యకాలంలో మహేశ్ సరసన సరితూగిన ఏకైక కథానాయిక మాత్రం కీయారా అద్వానీ. తాజాగా విడుదల చేసిన పోస్టర్ తో వారికి ఊరట లభించిందనుకోవాలి. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు.