హీరోయిన్ రష్మిక ఆన్ ది స్క్రీన్ పై ఓ మ్యాజిక్ చేస్తుంది. ఏడవడం మినహా ఏం చే యించినా ఆమె తన హావభావాలతో ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆ టెక్నిక్ తెలిసిన దర్శకుడు ఎవరైనా సరే రష్మికను ప్రేక్షకుల మీదకు గ్లామర్ అస్త్రంగా సులువుగా ప్రయోగించేయవచ్చు. ప్రామిస్ చేసినట్టు గానే ప్రతీ సోమవారం ఒక్కో సింగిల్ ను విడుదల చేస్తూ వస్తున్నారు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం టీం. ఇప్పటీకే విడుదల చేసిన రెండు లిరికల్ సాంగ్స్ కు మంచి స్పందన లభించింది. ఈ వారం కూడా ‘హి ఈజ్ సో క్యూట్’ అంటూ థర్డ్ సింగిల్ ను కూడా విడుదల చేశారు.

కేరళ లోకేషన్లలో కలర్ ఫుల్ గా చిత్రీకరించడమే కాదు, రష్మికను చాలా చలాకీగా, అందంగా ప్రెజెంట్ చేసారు. కుచ్చి కుచ్చి కూనమ్మా పాటలో మనీషా కొయిరాలా ఎలా కనిపిస్తుందో అలాంటి గిరిజన గెటప్ లో కూడా రష్మికను చూపించారు. కుచ్చి కుచ్చి కూనమ్మా పాటకు, ఈ పాటకు కూడా కొరియాగ్రాఫర్ రాజు సుందరం నే కావడం విశేషం. శ్రీమణి లిరిక్స్ అందించిన ఈ పాటని మధు ప్రియా పాడింది. మహేష్ బాబు గ్లామర్ ను ఎలోబరేట్ చేస్తూ ఈ పాట రాసినట్టు ఉన్నాడు లిరిసిస్ట్ శ్రీమణి.

ఈ పాటకి దేవి ఇచ్చిన ట్యూన్ కూడా బాగుంది. మహేష్ అభిమానులకు ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ కు ఈ పాట వెంటనే నచ్చేస్తుంది అనడంలో సందేహం లేదు. సినిమాలో గ్లామర్ టచ్ ఏ మేరకు వుంటుంది అన్నది ఈ సాంగ్ తో చిన్న శాంపిల్ చూపించారు. రష్మిక డ్యాన్స్ మూవ్ మెంట్లు కూడా బాగున్నాయి. మిగిలిన రెండు పాటలు కూడా ఇదే స్థాయిలో ఉంటే.. ఆల్బం మొత్తం హిట్ అయినట్టే అని చెప్పాలి. ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం జనవరి 11న విడుదల కాబోతుంది.