Rashmika reaction on Negative Trolls: రష్మిక మందన టాలీవుడ్ లోనే కాకుండా ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ లో ఒక ప్రముఖ హీరోయిన్. కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది ఇండస్ట్రీలో. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో మరి ఇంత ఫ్యాన్ బేస్ ని పెంచుతుంది. అయితే తనపై వస్తున్న నెగిటివ్ ట్రోల్స్ కి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది రష్మిక.
అసలు విషయానికి వస్తే, రీసెంట్ గా విడుదలైన కాంతార సినిమాని చూడకపోవటంతో ఆమెపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. అయితే రష్మిక ఈ విమర్శలకి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగింది.
చిన్న సినిమాగా విడుదలైన కాంతార ఇప్పుడు బాక్సాఫీస్వద్ద ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. ఇటీవల ఒక ప్రెస్మీట్లో రష్మిక ఆ సినిమాని చూడలేదు అని చెప్పటంతో ఈ విమర్శ దారితీశాయి.

Rashmika reaction on Negative Trolls: గత కొన్ని రోజులు లేదు వారాలు లేదు నెలలు లేదు కొన్ని సంవత్సరాలుగా కొన్ని విషయాలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. వాటిని పరిష్కరించాల్సిన సమయం ఆసన్నమైందని నేను భావిస్తున్నాను.
నెగిటివ్ ట్రోల్స్ నాపై చేస్తున్నారు. నేను ఎంచుకున్న జీవితం ఎంతో విలువైందని నాకు తెలుసు. అలా అనీ అందరూ అంగీకరించేలా ఉండాలంటే నా వల్ల కాదు. ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమించాలని నేను అనుకోను. అలా అని నాపై ప్రతికూలతను ప్రచారం చేయాలని దీనర్థమూ కాదు.
మిమ్మల్ని సంతోషపెట్టడానికి నేను చేయాల్సిన పని చేస్తున్నాను. అది నాకు తెలుసు. నా పని ద్వారా మీరు అనుభవంచే ఆనందమే నేను పట్టించుకుంటాను. మీరు గర్వపడేలా చేయడానికి నా శక్తి మేర నేను ప్రయత్నిస్తున్నాను. నేను చెప్పని విషయాలను కూడా ఇంటర్నెట్లో ఎగతాళిగా కామెంట్లు చేస్తున్నప్పుడు హృదయ విదారకంగా అనిపిస్తుంది.

చాలా నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. నేను చెప్పిన విషయాలు కూడా కొన్ని నాకు వ్యతిరేకంగా మారుతున్నాయని గుర్తించాను. నాకు, పరిశ్రమలో లేదా బయట నా రిలేషన్షిప్స్ను ఇబ్బంది కలిగించే కొన్ని తప్పుడు కథనాలు ఇంటర్నెట్లో వ్యాప్తి చెందుతున్నాయి.
నిర్మాణాత్మక విమర్శలను నేను ఎప్పుడూ స్వీకరిస్తాను. వాటి వల్ల నేను మెరుగ్గా పనిచేయగలుగుతాను. అయితే ప్రతికూలత, ద్వేషపూరిత విమర్శలు చేయడమేంటి? అలా చేయొద్దని చాలా కాలంగా చెబుతూనే ఉన్నాను. కానీ పరిస్థితి ఇంకా దిగజారింది. వీటిని పరిష్కరించడం ద్వారా నేను ఎవరినీ గెలవడానికి ప్రయత్నించడం లేదు. ఈ ద్వేషాన్ని బలవంతంగా మార్చాలని భావించడం లేదు.
మీ అందరి నుంచి పొందుతున్న ప్రేమను గుర్తించి అంగీకరిస్తున్నాను. మీ నిరంతర ప్రేమ, మద్దతు నన్ను ముందుకు నడిపించింది. బయటకు వచ్చి ఇలా చెప్పుకోడానికి నాకు ధైర్యాన్ని ఇచ్చింది. నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిపై నాకు ప్రేమ ఉంది. ఇప్పటి వరకు నేను పనిచేసిన వ్యక్తులు, నన్ను ఎప్పుడూ మెచ్చుకునే వారందరి కోసం కష్టపడి పనిచేస్తూనే ఉంటాను. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పినట్లు మీమ్మల్ని సంతోషపెట్టడమే నాకు సంతోషాన్నిస్తుంది.” అని రష్మిక మందన్నా తన ఇన్స్టాలో పేర్కొంది.