Rashmika Mandanna Romance With Varun Tej next movie

Rashmika Mandanna: ఛలో సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ రష్మిక మందన. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న రష్మిక ప్రస్తుతం తెలుగులో టాప్ ప్లేస్ లో ఉంది. టాలీవుడ్ లో ప్రస్తుతం ఆమెకు మామూలు క్రేజ్ లేదు. చిన్న హీరోల దగ్గర నుండి పెద్ద హీరోల వరకు అంతా ఈమెనే కావాలంటున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో బ్లాక్ బాస్టర్ అయిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలతో స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది . తెలుగుతో పాటు తమిళం.. కన్నడంలో మంచి గుర్తింపు దక్కించుకున్న రేష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తుంది . ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే తాజాగా బాలీవుడ్ బ్యూటీ ని ఈ అమ్మడు రిప్లై చేసిందని తెలుస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదలు పెడదాం అనుకునే లోపు కరోనా వచ్చింది. దాంతో షూటింగ్ ఆగిపోయింది. అల్లు బాబీ నిర్మించబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ ప్లేస్ లో రశ్మికను తీసుకోవాలని చూస్తున్నారట చిత్రయూనిట్. హీరోయిన్ విషయమై చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా తొందరలోనే ప్రకటించే అవకాశం ఉందట.