Saif Ali Khan Ravana Getup in Adipurush: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రజెంట్ ఎక్కడ చూసినా ఎక్కువ చర్చించుకుంటున్న చిత్రం ఆదిపురుష్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కొంతమంది ఈ చిత్రం ఆహా ఓహో ఏముంది అంటుంటే…మరి కొంతమంది అసలు ఈ చిత్రంలో ఏముంది అని ప్రశ్నిస్తున్నారు.. రామాయణం పేరుతో ప్లే స్టేషన్ లో ఉన్న దెయ్యాలని భూతాల్ని అన్నిటిని చూపిస్తున్నారు అని బాధపడుతున్న వారు ఉన్నారు.
Saif Ali Khan Ravana Getup in Adipurush: ఈ చిత్రంలో కొన్ని సందర్భాలు మరియు సన్నివేశాలు రామాయణ మహాకావ్యానికి భిన్నంగా ఉండటమే కాకుండా కాస్త అభ్యంతరకరంగా కూడా ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే థియేటర్ నుంచి బయటకు వచ్చి నిర్మోహమాటంగా చిత్రం బాగలేదు అని తమ ఒపీనియన్ చెప్పిన వారిని అభిమానులు అక్కడికక్కడ చితకబాదే సన్నివేశాలు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. అయినా చాలామంది ఈ చిత్రం గురించి ఘాటుగానే విమర్శిస్తున్నారు.
భారీ విజువల్ వండర్ గా తెరకెక్కించాము అని గొప్పలు చెప్పుకున్న ఈ చిత్రంలో రావణాసురుడి 10 తలలు పెట్టిన తీరు ప్రస్తుతం ప్రస్నార్థకంగా మారింది. అటు సినిమాలు ఇటు సీరియల్స్ రేటిలో రామాయణం గురించి వర్ణించిన రావణాసురుడి పాత్రకు 10 తలలు అనేవి నేరుగా కనిపించడం మనకు తెలుసు.. అలాగే పురాణాల్లో కానీ గ్రంథాల్లో కానీ రావణాసురుడు చిత్రపటం ఏదైనా ఉంటే అందులో కూడా పది తలలు నేరుగానే ఉంటాయి.
అయితే ఓం రౌత్ నిర్మించిన ఆది పురుష్ లో మాత్రం దశకంఠుడైన రావణాసురుడి 10 తలలు ద్రాక్ష గుత్తుల్లాగా కనిపిస్తున్నాయి. పైగా రావణాసురుడు అంటే మన పురాణాల ప్రకారం అఖండ మేధా సంపత్తు తో పాటు వాక్చాతుర్యం కూడా కలిగినటువంటి రాక్షస రాజు. ఆయన వేషధారణ ఈ మూవీలో కాస్త అభ్యంతరకరంగా ఉందని చెప్పవచ్చు. స్వర్ణ సోహితమైనటువంటి ఆభరణాలను ధరించి పట్టు వస్త్రాలతో శోభాయమానంగా ఉండే రావణాసురుడికి ప్లే స్టేషన్ లో విలన్ క్యారెక్టర్ లా కనిపిస్తున్న ఈ రావణాసురుడికి అసలు పొంతన లేదు.

ఈ నేపథ్యంలో అప్పుడెప్పుడో ఈటీవీలో వచ్చిన అమృతం సీరియల్ లో రామాయణం నాటకం కోసం రావణాసురుడి క్యారెక్టర్ కి తలలు రెడీ చేస్తారు… అయితే…అమృతం క్యారెక్టర్ చేస్తున్న శివాజీ ఆ తలలను రావణుడు పాత్రధారి కి నేరుగా పెట్టకుండా ఒకదానిమీద ఒకటి పెడతాడు ఇదేమిటి ఇలా పెట్టావని అతను ప్రశ్నించగా.. మన శాస్త్రం తలలు రెక్టాంగిల్ గా పిరమిడ్ గా వంకరగా నిటారుగా ఉండాలని చెప్పడం లేదు మనకు ఎలా కన్వీనియంట్ అయితే అలా పెట్టుకోమని చెప్తుంది అని తమాషాగా అంటాడు. ఇప్పుడు ఆ పాత వీడియోని ట్రోల్ చేస్తూ.. ఓం రౌత్ రావణాసురుడి క్యారెక్టర్ కి ఈ సీరియల్ నుంచి ఇన్స్పిరేషన్ పొందాడు అని కామెంట్లు పెడుతున్నారు.