Ravanasura Review in Telugu: మాస్ మహారాజు రవితేజ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన సరికొత్త చిత్రం రావణాసుర. గత కొద్ది కాలంగా మంచి హిట్ పడక ఇబ్బంది పడుతున్న రవితేజ ధమాకా చిత్రంతో తిరిగి తన పూర్వపు ఫామ్ లోకి వచ్చాడు. అయితే ఈసారి రావణాసుర మూవీతో ఏకంగా బ్లాక్ బస్టర్ బోనాన్జా కొట్టాలి అన్న పట్టుదలతో ఉన్నాడట. మంచి పక్కా ప్లాన్ తో ఫుల్ వర్క్ అవుట్ తో రిలీజ్ అయిన రావణాసుర చిత్రం ఈరోజు విడుదలయ్యింది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం.
నటీనటులు : రవితేజ, సుశాంత్, మేఘ ఆకాష్, అను ఇమ్మానుయేల్ , దక్ష నాగర్కర్, పూజిత పొన్నాడ, ఫైరా అబ్దుల్లా, జయరాం, సంపత్ రాజ్, రావు రమేష్, మురళి శర్మ, హైపర్ ఆది, సత్య తదితరులు.
డైరెక్టర్ : సుధీర్ వర్మ
సంగీతం : హర్ష వర్ధన్ రామేశ్వర్, భీమ్స్
నిర్మాతలు : రవితేజ , అభిషేక్ నామ
రన్ టైం: 2గం 21నిమి
రిలీజ్ డేట్: ఏప్రిల్ 7, 2023
రేటింగ్ : 2.5/5
Ravanasura Review కథ: లాయర్ అవ్వాలి అనే లక్ష్యంతో ఫైరా అబ్దుల్లా దగ్గర జూనియర్ లాయర్ గా రవితేజ చేరుతాడు. అనుకోకుండా వీళ్ళిద్దరూ మేఘ ఆకాష్ తండ్రి సంపత్ రాజ్ కేస్ పై ఉన్న మర్డర్ కేస్ మీద పనిచేస్తుంటారు. ఈ మర్డర్ కేస్ కు తనకు ఎటువంటి సంబంధం లేదని ఎవరో కావాలని తనను ఇరికిస్తున్నారని సంపత్ రాజ్ పోలీసుల ముందు ప్రాధేయపడిన అతన్ని ఎవరు నమ్మరు. మరోపక్క ఇదే తరహా మర్డర్స్ ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా జరుగుతూ ఉంటాయి.
అయితే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే ఈ సీరియల్ హత్యల వెనుక ఉన్నది మరెవరో కాదు రవితేజనే…అసలు ఎందుకు రవితేజ మర్డర్ గా మారాడు.. సంపత్ నే ఎందుకు ఇందులో ఇరికించారు….అసలు ఈ సీరియల్ హత్యల వెనక రహస్యం ఏమిటి అనేది మాత్రం వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
ఈ మూవీలో మొత్తం రవితేజ ట్రేడ్ మార్క్ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది.
సడెన్ గా కామెడీ నుంచి థ్రిల్లర్ గా మారిన ఈ చిత్రం మంచి హైపుని క్రియేట్ చేస్తుంది.
రెండు డిఫరెంట్ స్టేట్స్ లో రవితేజ నటన ఎక్స్లెంట్ అని చెప్పవచ్చు.
క్రైమ్ సన్నివేశాలు చిత్రంలో హైలెట్గా నిలుస్తాయి.
ఫ్రీ ఇంటర్వెల్స్ సన్నివేశం అయితే నెక్స్ట్ ఏం జరగబోతోంది అన్న ఆత్రుతను ప్రేక్షకులలో సృష్టిస్తుంది.
సుశాంత్ క్యారెక్టర్ కూడా మూవీకి మంచి ప్లస్ పాయింట్ అవుతుంది.
ఈ మూవీలో ఉన్న ఐదుగురు హీరోయిన్లకు కథకు తగ్గ పాత్రను ఇవ్వడం విశేషం.
మైనస్ పాయింట్స్:
స్క్రీన్ ప్లే మీద డైరెక్టర్ కాస్త శ్రద్ధ తీసుకుంటే ఇంకా బాగుండేది.
అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు సాంగ్స్ ధమాకా మూవీ అంత రేంజ్ లో లేవు అని చెప్పవచ్చు.
చివరి మాట: ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “రావణాసుర” సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ ని సరికొత్త వెర్షన్ ఆకట్టుకుంది. అలాగే సినిమాలో థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ కూడా బాగానే ఉంది కానీ సుధీర్ వర్మ సినిమా కథ విషయంలో కాస్త కొత్తగా ఏమన్నా ట్రై చెయ్యాల్సింది. మంచి మాస్ ఎంటర్టైన్మెంట్, కామెడీ మరియు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఒకేసారి కావాలి అనుకునే వారికి ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుంది. ఏదో సాగదీసినట్టు, సుత్తిగా కాకుండా మంచి టైం పాస్ అయ్యే మూవీ అని చెప్పవచ్చు.