కేజీఎఫ్2 షూట్ లో ‘రవీనాటాండన్’ ఎంట్రీ..RRR తో పోటీ..?

Raveena Tandon joins KGF Chapter 2 shooting
Raveena Tandon joins KGF Chapter 2 shooting

(Raveena Tandon joins Yash KGF: Chapter 2, director Prashanth extends warm welcome) KGF2 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేజీఎఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ వచ్చేస్తోంది. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ రెండో భాగాన్ని ఛాప్టర్‌ 2గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులోనూ యష్‌నే హీరో. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సంజయ్‌దత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఆయన లుక్ కూడా విడుదలైంది.

ఇక బాలీవుడ్ భామ రవీనా టాండన్ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది చిత్ర బృందం. దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ..రవీనా టాండన్ దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. డెత్ వారెంట్ జారీ చేసిన లీడింగ్ లేడీ వచ్చేసిందని కామెంట్ ద్వారా తెలిపారు. రవీనా టాండన్ ఈ చిత్రంలో రమికా సేన్‌గా నటిస్తుంది.

ఇకపోతే.. కేజీఎఫ్ 2 చిత్రం ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఖాళీ చేసిన జులై 30 – 2020వ తేదీన వచ్చే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. దీంతో కేజీఎఫ్ 2 చిత్రం స్టార్ కాస్ట్ విషయంలో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో పోటీ పడుతున్నట్లుగా అనిపిస్తుందని సినీ పండితులు అంటున్నారు.