(Ravi Teja and Shruti Haasan’s Krack Sankranti poster released)మాస్ మహారాజ రవితేజ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా క్రాక్. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై బి మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. నిజానికి గతంలో రవితేజ, గోపీచంద్ ల క్రేజీ కాంబినేషన్లో డాన్ శ్రీను, బలుపు సినిమాలు వచ్చాయి. అయితే వాటిలో డాన్ శ్రీను ఫ్లాప్ అవ్వగా బలుపు సినిమా మంచి హిట్ కొట్టింది. మరి మూడవ సారి వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ ని సాధిస్తుందో చూడాలి.
ఇకపోతే నేడు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ సినిమా లేటెస్ట్ పోస్టర్ ని కాసేపటి క్రితం తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. శృతిహాసన్ రాయల్ ఎన్ ఫీల్డ్ బైకును నడిపిస్తుండగా..పల్లెటూరు గెటప్ లో ఉన్న రవితేజ చేతిలో టిఫిన్ క్యాన్ పట్టుకుని బైకు వెనకాల కూర్చున్న పోస్టర్ సరికొత్తగా ఉంది.
రవితేజ ఒక క్రాక్ పోలీస్ ఆఫిసర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మంచి మాస్ , కమర్షియల్ హంగులతో పాటు పలు యాక్షన్ సీన్ల మేళవింపుగా దర్శకుడు గోపీచంద్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టాక్. న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన క్రాక్ చిత్ర ఫస్ట్ లుక్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. రవితేజ మరోసారి ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్గా అలరించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు….!!