Raviteja Disco Raja Movie Day 2 box office collections report
Raviteja Disco Raja Movie Day 2 box office collections report

(Ravi Teja Disco Raja day 2 box office collection, worldwide collections, Ravi teja all time collections report)మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ ఎంటర్టైనర్ డిస్కో రాజా విడుదలకు ముందు మంచి అంచనాలను ఏర్పరిచింది. ‘రాజా ది గ్రేట్’ చిత్రం తర్వాత సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మన మాస్ మహా రాజ్ రవితేజకు ఈసారి కూడా హిట్ దక్కేలా లేదు. అయితే డిస్కో రాజా మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంలో విఫలమైంది. ఈ చిత్రానికి యావరేజ్ రేటింగులే వచ్చాయి. సైన్స్ ఫిక్షన్ కథ అని చెప్పినా కానీ డిస్కో రాజాలో తర్వాతి వ్యవహారం రొటీన్ గానే ఉందంటూ క్రిటిక్స్ అభిప్రాయపడ్డారు. ఇక ఓపెనింగ్స్ కూడా పెద్ద ఆశాజనకంగా లేవనే చెప్పాలి.

అయితే తొలిరోజు ఈ చిత్రం డీసెంట్ గానే పెర్ఫార్మ్ చేసింది. మొదటి రోజు ఈ చిత్రం 2.58 కోట్ల షేర్ ను సాధించింది. ఇక రెండో రోజు కూడా డిస్కో రాజా బాగానే హోల్డ్ చేసింది. శనివారం రోజు ఈ చిత్రం 1.65 కోట్ల షేర్ ను సాధించింది. రెండు రోజులకు కలుపుకుంటే డిస్కో రాజా షేర్ 4.23 కోట్లకు చేరుకుంది. ‘డిస్కో రాజా’ చిత్రానికి 22 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక ఈ ‘డిస్కో రాజా’ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 17.20 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో రోజు కూడా ఈ చిత్రం పెర్ఫార్మన్స్ ఇంత డల్ గా ఉండడం చూస్తుంటే చాలా కష్టం అనే అనిపిస్తుంది.

నైజాం 1.75 cr
సీడెడ్ 0.57 cr
ఉత్తరాంధ్ర 0.51 cr
ఈస్ట్ 0.32 cr
వెస్ట్ 0.25 cr
కృష్ణా 0.30 cr
గుంటూరు 0.28 cr
నెల్లూరు 0.17 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.26 cr
ఓవర్సీస్ 0.40 cr
వరల్డ్ వైడ్ టోటల్ 4.81 cr (share)

 

ఈరోజు ఆదివారం కూడా ఈ చిత్రం డీసెంట్ గానే పెర్ఫార్మ్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఈ చిత్రానికి కనుక పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే కలెక్షన్స్ మరో రేంజ్ లో ఉండేవని అంటున్నారు. ఏదేమైనా డిస్కో రాజా ప్రస్తుతానికి పర్వాలేదనిపిస్తోంది. మరి వీక్ డేస్ లో ఈ చిత్రం ఎలా పెర్ఫార్మ్ చేస్తుందన్న దానిపై చిత్ర విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.