Homeసినిమా వార్తలురవితేజ ఈగల్ రిలీజ్ డేట్… సంక్రాంతి పోటీ సినిమాలు ఇవే.!

రవితేజ ఈగల్ రిలీజ్ డేట్… సంక్రాంతి పోటీ సినిమాలు ఇవే.!

Ravi Teja next Eagle Release Date, Eagle telugu movie releasing on January 13th 2024, Sankranti 2024 movies list, Ravi Teja Upcoming movies, bigg clash at Sankranti 2024 telugu movies. రవితేజ ఈగల్ రిలీజ్ డేట్… సంక్రాంతి పోటీ సినిమాలు ఇవే.!

Ravi Teja next Eagle Release Date, Eagle telugu movie releasing on January 13th 2024, Sankranti 2024 movies list, Ravi Teja Upcoming movies, bigg clash at Sankranti 2024 telugu movies

రవితేజ రాబోయే సినిమాల్లో ఒకటైన ఈగల్ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ ప్రకటించడం జరిగింది.. ఈ సినిమాతో రవితేజ కూడా రాబోయే సంక్రాంతి కి  బరిలో దిగారు. ఈ సినిమా రవితేజ కెరీర్ లో 73వదిగా రావడం జరుగుతుంది. ఈగల్ సినిమాని జనవరి 13న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. 

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న రవితేజ ఈగల్ మొదటి దగ్గర నుంచి సంక్రాంతికి విడుదలవుతుందన్న వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. చివరికి ఈ సినిమాని అనుకున్నట్టే మేకర్స్ రాబోయే సంక్రాంతి జనవరి 13న విడుదల చేస్తున్నట్టు తెలిపారు.  పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్లు నిర్మిస్తున్న ఈ సినిమా లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చేస్తుంది. 

ఈగల్ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ఇప్పటికే విడుదల అయ్యి ఫాన్స్ లోను అలాగే మూవీ లవర్స్ లో భారీ అంచనాలను ఏర్పడేటట్టు చేసింది. రవితేజ అలాగే అనుపమ కాకుండా ఈ సినిమాలో కావ్యా థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా ముందు టైగర్ నాగేశ్వరరావు సినిమాని అక్టోబర్ 20న విడుదలకు సిద్ధం చేశారు మేకర్స్.

ఈ రెండు సినిమాలతో పాటు రవితేజ గోపీచంద్ మలినేని సినిమా కూడా ఫిక్స్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన షూటింగు జనవరిలో మొదలవుతుందని తెలుస్తుంది.  ఇక ఈగల్ సినిమాతో సంక్రాంతి రేసులో ఉన్న రవితేజ కి పోటీగా మహేష్ బాబు గుంటూరు కారం, హనుమాన్, నా సామి రంగా, విజయ్ దేవరకొండ VD13 సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడనుంది.