రవితేజ ‘ఖిలాడీ’ ఫస్ట్ గ్లింప్స్‌

0
310
ravi-teja-khiladi-first-glimpse-released
ravi-teja-khiladi-first-glimpse-released

ఒక్క హిట్ పడితే స్టార్ హీరో ఫేట్ ఎలా మారుతుందో అందరికీ తెలిసిందే. ఫ్లాపు పడితే ఎంత కష్టంగా ఉంటుంది.. ఎన్ని రకాలుగా కామెంట్లు వినిపిస్తాయో.. ఒక్క హిట్ పడితే వాటికి వంద రెట్ల ప్రశంసలు వస్తుంటాయి. వరుస సినిమాలతో రవితేజ డిజాస్టర్లను చవిచూశాడు. అలా ఫ్లాపులు కొడుతూ వస్తున్న రవితేజకు క్రాక్ చిత్రం ఊపిరినిచ్చింది. ఆ క్రాక్ చిత్రం కేవలం రవితేజకు మాత్రమే కాదు.. మాస్ పవర్ ఏంటో చూపించి ఇండస్ట్రీ జనాలకు కొత్త ఊపునిచ్చింది.

కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఓ సినిమా ఇంతలా కలెక్షన్లు కొట్టగలదా? అనే అనుమానాలను తిప్పి కొట్టింది. సంక్రాంతి పండుగ ముగిసినా కూడా క్రాక్ థియేటర్ల వద్ద రవితేజ అభిమానుల జాతర మాత్రం ముగియడం లేదు. అలా క్రాక్ రూపంలో కెరీర్ బెస్ట్ సినిమాగా మిగిలింది. అలా ఊపులో ఉన్న రవితేజ ఇప్పుడు ఖిలాడీ దుమ్ములేపేందుకు రెడీ అవుతున్నాడు. అసలే మంచి ఉత్సాహంలో ఉన్న రవితేజ తన అభిమానులకు మంచి కిక్కిచ్చే న్యూస్ చెప్పాడు.

జనవరి 26 సందర్భంగా రవితేజ తన ఫ్యాన్స్‌కు అప్డేట్ ఇచ్చాడు. ఖిలాడీ ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసారు ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రంలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని రమేష్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. మొత్తానికి రవితేజ సంక్రాంతి సీజన్‌లో దుమ్ములేపి ఇప్పుడు రిపబ్లిక్ డేను కూడా వదలడం లేదు.

Previous articleయేసు క్రీస్తు గెటప్ లో జగపతి బాబు
Next articlePawan Kalyan and Rana daggubati’s Regular shooting started today