మాస్ మహారాజా రవితేజ ఖిలాడీ షూటింగ్ అప్డేట్.!!

Ravi Teja Khiladi Shooting Update: మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం అందరికి తెలిసిందే. ట్రాక్ మూవీతో ఈ సంవత్సరం హిట్ అందుకున్న రవితేజ ఇప్పుడు రెడీ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఖిలాడీలో రవితేజకి జోడీగా మీనాక్షి చౌదరి..డింపుల్ హయతి నటిస్తున్నారు. ఈ మూవీ సంబంధించి ఈరోజు మూడో సాంగ్ (Khiladi 3rd song) సంబంధించే ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు.

రవితేజ (Ravi Teja) ఇమేజ్ కి తగ్గట్టు పక్కా మాస్ కంటెంట్ తోనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని చిత్ర దర్శకుడు రివీల్ చేసారు. అన్ని పనులు పూర్తిచేసి సినిమాని ఫిబ్రవరి 11న రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ (Khiladi Shooting) సంబంధించి ఒక అప్డేట్ చిత్ర యూనిట్ నుంచి వచ్చింది.

రవితేజ (Ravi Teja) కిలాడీ (Khiladi) మూవీకి సంబంధించి చివరి పాట షూటింగ్ జరుగుతుంది. అలాగే ఈ పాట మినహా టాకీ పార్ట్ ..ప్యాచ్ వర్క్ కూడా పూర్తయింది అంట. మరోవైపు ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అని సమాచారం అందింది. అన్నీ అనుకున్నట్టు గానే ఈ సినిమాని ఫిబ్రవరి 11న రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. అదే నెలలో చిరంజీవి నటించి ఆచార్య కూడా రిలీజ్ అవుతుంది.

Ravi Teja Khiladi Climax Busy in song shoot
Ravi Teja Khiladi Climax Busy in song shoot

ఇంకా రవితేజ (Ravi Teja) మిగతా సినిమాల విషయానికి వస్తే, కిలాడీ (Khiladi shooting) షూటింగ్ పూర్తి కాగానే `రామారావు ఆన్ డ్యూటీ`..`ధమాకా` షూటింగ్ పనులలో బిజీగా అవుతాడని సమాచారం అందుతుంది. రామారావు చిత్రానికి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. `ధమాకా` చిత్రానికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఇవి కాకుండానే రవితేజ ఇంకో రెండు సినిమాలు కూడా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

 

Related Articles

Telugu Articles

Movie Articles