మాస్ మహరాజ్ రవితేజ ‘క్రాక్’ జోరు కంటిన్యూ

0
192
Ravi Teja Krack movie box office collection and successfully running

మాస్ మహరాజ్ ఫ్యాన్స్ కు ఈ సంక్రాంతి మరింత స్పెషల్ చేశాడు రవితేజ. గోపీచంద్ మలినేని డైరక్షన్ లో వచ్చిన క్రాక్ సినిమా సంక్రాంతికి రిలీజై సూపర్ సక్సెస్ అందుకుంది. గోపీచంద్ మలినేనితో ఆల్రెడీ డాన్ శీను, బలుపు సినిమాలతో హిట్ అందుకున్న రవితేజ మూడవ సినిమాని కూడా హిట్ అందుకుని హ్యాట్రిక్ అనిపించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో రవితేజ సందడి మామూలుగా లేదు. తన బాడీ లాంగ్వేజ్ కి తన కథ .. తన ఎనర్జీకి తగిన పాత్ర పడితే చెలరేగిపోవడం ఖాయమని ఆయన మరోసారి నిరూపించాడు.

తొలిరోజు నుంచే తన దూకుడు మొదలుపెట్టింది. అయితే ‘రెడ్’ .. ‘అల్లుడు అదుర్స్’ సినిమాలు ఆ దూకుడుకు కళ్లెం వేస్తాయేమోననే మాటలు వినిపించాయి. ఆ రెండు సినిమాలు కూడా మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో, ‘క్రాక్’ జోరు కంటిన్యూ కావడం ఖాయమనేది తేలిపోయింది. క్రాక్ సినిమా ఐదురోజుల్లో లాభాల పాట పట్టింది. 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన క్రాక్ ఐదురోజుల్లో 17 కోట్లు రాబట్టింది. మొదటిరోజు 6.27 కోట్లు రాబట్టగా మొత్తం ఐదురోజుల్లో 17.01 కోట్ల షేర్ తో సూపర్ హిట్ అనిపించుకుంది.

‘రాజా ది గ్రేట్’ తరువాత రవితేజకు సరైన హిట్ పడలేదు. ఎప్పటిలానే కథలను ఎంచుకుంటున్నాడు .. సెట్స్ పైకి వెళుతున్నాడు .. థియేటర్లకు వస్తున్నాడు. కానీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సందడి లేకుండా పోతోంది. దాంతో ఆయన అభిమానులు చాలా నిరాశకు లోనయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో తన కెరియర్లోనే పెద్ద హిట్ కొట్టేసిన రవితేజ, మాస్ మహారాజుకు ఇప్పట్లో తిరుగులేదని నిరూపించాడు. 50 శాతం ఆక్యుపెన్సీ అయినా కూడా సినిమాలు మంచి వసూళ్లు రాబడుతున్నాయి. రవితేజ క్రాక్ సినిమా కూడా 50 శాతం ఆక్యుపెన్సీ అయినా కూడా భారీ వసూళ్లు రాబడుతుంది. కరెక్ట్ సినిమా పడితే రవితేజ స్టామినా ఏంటన్నది ప్రూవ్ అవుతుంది.