క్రాక్ మూవీ రివ్యూ – ఆకట్టుకొనే మాస్ బొమ్మ

0
382
ravi-teja-krack-movie-review-in-telugu
ravi-teja-krack-movie-review-in-telugu

నటీనటులు: రవితేజ, శ్రుతిహాసన్, వరలక్ష్మి, సముద్రఖని, అప్సర రాణి తదితరులు
మ్యూజిక్: థమన్
సినిమాటోగ్రఫీ: జీకే విష్ణు
నిర్మాత: ఠాగూర్ మధు
దర్శకత్వం: గోపీచంద్ మలినేని

 

కరోనా కారణంగా సినీ పరిశ్రమ కష్టాల్లో పడింది. థియేటర్లు తెరుచుకున్నా సినిమాలు విడుదలవ్వడానికి కాస్త భయపడ్డాయి. కానీ ఈ మహమ్మరి తరువాత 2021లో విడుదలైన పెద్ద సినిమా క్రాక్. పవర్ ఫుల్ పోలీస్‌గా మాస్ మహారాజా రవితేజ నటించిన ఈ సినిమా నిన్నటి రోజున ఆలస్యంగా థియేటర్లోకి వచ్చింది.  సినిమా టీజర్, ట్రైలర్‌లు ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఈ అంచనాలను క్రాక్ అందుకుందా? అభిమానులు ఆశించిన రేంజ్‌లో అన్ని ఎలిమెంట్స్‌ని చూపించిందా? ఈ సినిమాతో చూడటానికి వచ్చిన అభిమానులు సంతృప్తి చెందారా?

 

కథ : ఓ క్రేజీ పోలీస్ ఆఫీస‌ర్‌ డ్యూటీ ఎక్కడైనా త‌న ప‌వ‌ర్ ఏంటో చూపించేస్తుంటాడు. ఎవడైనా రౌడీ అంటే వాడి తాట తీసి బొక్కలో వేస్తాడు. డ్యూటీలో ఉన్న ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ స‌లీం అనే ఓ క్రిమిన‌ల్‌ను ప‌ట్టుకున్నాడని, పోలీస్ క‌డ‌ప‌కు ట్రాన్స్‌ఫ‌ర్ అవుతాడు. ప్రదేశం మారినంత మాత్రాన పోలీస్ మారడు. కడపలో కూడా ఓ చిన్న క్రమిన‌ల్‌గా చెలామణీ అవుతున్న ర‌వి శంక‌ర్‌కు చుక్కలు చూపిస్తుంటాడు. దాంతో క్రాక్ పోలీస్ గురించి మరో పోలీస్ ఆఫీస‌ర్ ర‌వి శంక‌ర్‌కు కొన్ని వివ‌రాలు చెప్తాడు. దీంతో అతడి గురించి తెలుసుకోవ‌డానికి ర‌విశంక‌ర్ అనేక ప్రయత్నాలు చేస్తూ అందులో భాగంగా రాజ‌మండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి స‌ముద్రఖ‌నిని క‌లుస్తాడు. క్రాక్ పోలీస్ గురించి స‌ముద్రఖ‌ని ఏం చెప్పాడు. స‌ముద్రఖని జైల్లో ఎందుకు ఉన్నాడు అన్నది మిగ‌తా క‌థ‌.

 

 ప్లస్ పాయింట్స్: 
మాస్ మహారాజ పాత్ర
థమన్ మ్యూజిక్, మాస్ ఎలివేషన్స్, ఫైట్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్‌లు

మైనస్ పాయింట్:
ఎక్కువ కథ లేదు

 

విశ్లేష‌ణ‌:  రవితేజ ‘క్రాక్’ మసాలా మూవీల ల్లో టాప్ లో నిలిచింది. కథ నిస్తేజంగా ఉన్నప్పటికీ, అలాగే రన్ ‌టైమ్ చాలా పొడవుగా ఉన్నప్పటికీ, మరియు కొన్ని లాజిక్స్ కూడా మిస్ అయినప్పటికీ. ముఖ్యంగా క్రాక్ పాటలు, యాక్షన్ సీక్వెన్స్ అండ్ రవితేజ నటనతో పాటు మిగిలిన నటీనటుల నటన కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది. ఈ సినిమా మాస్ సినిమాలను ఇష్టపడేవారికి కచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమాతో మాస్ అభిమానులకు బొమ్మ అదిరింది అనే అభిప్రాయాన్ని కలిగించడంలో గోపీచంద్ మలినేని మరోసారి నెగ్గాడు.  ప్రేక్షకులకు సంక్రాంతికి మంచి ఛాయిస్ అవుతుంది.

 

రేటింగ్: 3.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here