రవితేజ,శృతీ హాసన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘క్రాక్’.గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమా మొదటి 8 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమయిన కలెక్షన్స్ వసూలు చేయగా.. 9వ రోజు కూడా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది.
‘క్రాక్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 18 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 8 రోజులకు గాను ఈ చిత్రం 25.51 కోట్ల షేర్ ను రాబట్టింది. 50 శాతం ఆకుపెన్సీతోనే ఈ రేంజ్ కలెక్షన్లను రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ చిత్రం 8 రోజుల కలెక్షన్లను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం:7.99 cr
సీడెడ్:4.21 cr
ఉత్తరాంధ్ర:2.78 cr
ఈస్ట్:2.09 cr
వెస్ట్:1.74 cr
కృష్ణా:1.62 cr
గుంటూరు:1.94 cr
నెల్లూరు:1.28 cr
ఏపీ+తెలంగాణ టోటల్: 23.64 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా:1.22 cr
ఓవర్సీస్:0.65 cr
టోటల్ వరల్డ్ వైడ్ :25.51 cr