‘ క్రాక్ ‘ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు..

0
505
Ravi Teja Next Gopichand Malineni Krack Film Locked Release date
Ravi Teja Next Gopichand Malineni Krack Film Locked Release date

(Ravi Teja Next Gopichand Malineni Krack Film Locked Release date, Ravi Teja 2020 movie latest updates)మాస్ మహారాజా రవితేజ – గోపీచంద్ మలినేని కలయికలో రవితేజ 66 వ చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం క్రాక్. డాన్ శ్రీను , బలుపు చిత్రాల తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న, ఆదివారం రవితేజ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం మాస్‌ మహారాజ అభిమానులుకు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ‘క్రాక్‌’ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఈ సినిమాని మే 08 2020 న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసారు.

పోస్టరులో రవితేజ ఖాకీ డ్రస్సులో వెహికిల్ నుంచి బయటకు వస్తూ కనిపించాడు. రవితేజ పవర్‌ఫుల్‌ పోలీస్‌ గెటప్‌లో ఉన్న ఓ స్పెషల్‌ లుక్‌ను సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసిన చిత్రబృందం.. వేసవి కానుకగా మే 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించింది. తమిళ నటుడు సముద్రఖని ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. ఈ మూవీలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కూడా రవితేజ సరసన ఆడిపాడనుంది.

రవితేజ కథానాయకుడిగా నటించిన ‘డిస్కోరాజా’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజకు జంటగా పాయల్‌ రాజ్‌పుత్‌, నభానటేశ్ నటించారు. బాబీ సింహా, వెన్నెల కిషోర్‌, సత్యరాజేశ్‌ కీలకపాత్రలను పోషించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

 

Previous articleబన్నీ – సుకుమార్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
Next articleఆ విషయంలో మా అమ్మ సలహాలు తీసుకున్నాను