RT4Gm Story: మాస్ మహారాజ రవితేజ అలాగే గోపీచంద్ మలినేని ట్రాక్ అనే సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన సంఘటన తెలిసిందే. క్రాక్ సినిమా రవితేజ ఫాన్స్ కి చాలా బూస్ట్ నిచ్చినట్టే చెప్పాలి. మళ్లీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో RT4GM సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ను కూడా నిన్న మేకర్స్ విడుదల చేశారు. RT4GM సినిమా స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో చాలా ప్రచారాలు జరుగుతున్నాయి.
RT4Gm Story: రవితేజ (Ravi teja) అలాగే గోపీచంద్ మలినేని (Gopichand mallineni) సినిమా RT4GM ఉంటుంది అనే ప్రచారం మొదలైన దగ్గర నుండి రియల్ స్టోరీ తో వస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో కథనాలు నడిచాయి. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు వివాదాస్పద కథతో మాస్ మహారాజ సినిమా RT4GM story ఉంటుంది అని తెలుస్తుంది.
ఇక అసలు విషయానికి వెళ్తే, సుమారు 40 సంవత్సరాల కిందట గుంటూరు జిల్లాలోని చుండూరులో జరిగిన యదార్థ సంఘట స్టోరీగా తీసుకొని గోపీచంద్ మన ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది. చూడూరులో జరిగిన యదార్ధ సంఘటన ఏమిటంటే, అగ్రవర్ణాల వాళ్లకు సంబంధించిన 300 మంది దళితులైన 8 మందిని చంపిన సంఘటన ఇప్పటికీ అక్కడ ఉన్న స్థానికులు గుర్తు చేసుకుంటూ ఉంటారు.

అప్పటిలో ఈ యదార్థ సంఘటన దేశమంతటా చర్చనీయాంశం అయింది. ఇదే సంఘటన ఆధారంగా గోపీచంద్ ఒక కథను తయారు చేసుకొని మన ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది. క్రాక్ సినిమాలో ఒంగోలు రౌడీ షీటర్ ని అలాగే బాలకృష్ణ సినిమా వీరసింహారెడ్డి స్టోరీ కూడా పురాతన లైబ్రరీలో రీసెర్చ్ చేసి మరి మన ముందుకు రావడం జరిగింది. మరోసారి రవితేజ తో అదేవిధంగా వివాదాస్పద కథతో దర్శకుడు గోపీచంద్ మన ముందుకు రాబోతున్నారు.