Ravi Teja next Tiger Nageswara Rao First Look Poster Date: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ ఈ యేడాది విడుదకాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటి. కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 వంటి రెండు బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్‌బస్టర్‌లను అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇది.
Ravi Teja next Tiger Nageswara Rao First Look Poster Date:తాజాగా మేకర్స్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల తేదీని అనౌన్స్ చేశారు. టైగర్ నాగేశ్వరరావు’ ఫస్ట్ లుక్ మే 24న విడుదల కానుంది. టైగర్ నాగేశ్వరరావు 1970ల నేపథ్యంలో స్టూవర్టుపురం లోని గజదొంగ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోంది. ఈ పవర్ ఫుల్ పాత్ర పోషించేందుకు రవితేజ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు.
ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా సరికొత్త బాడీ లాంగ్వేజ్, యాసతో ఆకట్టుకుంటారు. ఈ సినిమాలో రవితేజ సరసన నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో భారీ బడ్జెట్‌తో ఆయన ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 5 ఎకరాల స్థలంలో సినిమా కోసం స్టువర్టుపురం గ్రామాన్ని రిక్రియేట్ చేయడానికి భారీ బడ్జెట్‌ను కేటాయించారు.

ఈ చిత్రానికి ఆర్ మదీ ISC సినిమాటోగ్రాఫర్ కాగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ కాగా, మయాంక్ సింఘానియా సహ నిర్మాత. ఈ చిత్రం అక్టోబర్ 20 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల అవుతుంది.
Web Title: Ravi Teja next Tiger Nageswara Rao First Look Poster Release Date locked, Ravi Teja next movie first look poster, Tiger Nageswara Rao First Look on May 24th, Ravi Teja upcoming movie news