మాస్ మహారాజ్ రవితేజ రావణాసుర రిలీజ్ డేట్ ఫిక్స్..!!

Ravanasura Release date: ఈరోజు సంక్రాంతి పండుగ సందర్బంగా మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న రావణాసుర సినిమా మేకర్స్ రవితేజ లుక్‌ని విడుదల చేసారు. స్వామి రారా ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుంది. రావణాసుర చిత్రంలో రవితేజతో పాటు నటుడు సుశాంత్ కూడా నటిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రవితేజ కొత్త సినిమా ప్రారంభమయింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఇవాళ పూజా కార్యక్రమాలని నిర్వహించింది. అలాగే మెగాస్టార్ చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చెయ్యడమే కాకుండా రిలీజ్ డేట్ ని కూడా కన్ఫర్మ్ చేశారు. 2022 సెప్టెంబర్ 30న రావణాసుర సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు.

‘రావణాసుర’ సినిమాలో రవితేజ లాయర్ పాత్రలో కనబడబోతున్నాడు. రవితేజ కెరీర్ లో తొలిసారి లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. సుధీర్ వర్మ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు, రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ఖిలాడి చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది మరియు ఈ చిత్రం నుండి మొదటి పాట కూడా ఇటీవల విడుదలైంది. ఈ పాట కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Ravi Teja Ravanasura First Look Poster
Ravi Teja Ravanasura First Look Poster

 

Related Articles

Telugu Articles

Movie Articles