Ravi Teja romance with dimple hayati and meenakshi choudhary

Ravi Teja: Dimple Hayati – meenakshi choudhary:  రవితేజ ‘క్రాక్’ సినిమా తర్వాత చేయబోతున్న సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహించబోతున్నాడు. క్రాక్ మూవీ దాదాపుగా పూర్తి అయ్యింది. ఈ నెల చివరి వరకు లేదా అతి త్వరలోనే రవితేజ.. రమేష్ వర్మల కాంబో మూవీ పట్టాలెక్కబోతుంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉండటంతో… డింపుల్ హయాతి, మీనాక్షి చౌధురిని తీసుకున్నారు. తెలుగమ్మాయి అయిన డింపుల్ హయాతి ‘గద్దలకొండ గణేష్‌’లో ‘జర్ర జర్ర…’ పాటతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

మరో హీరోయిన్‌గా ఎంపికైన మీనాక్షి చౌధురి ప్రస్తుతం సుశాంత్‌‌తో ‘ఇచట వాహనములు నిలుపరాదు’లో సినిమాలో నటిస్తున్నారు. వచ్చే నెల జరుగబోతున్న షెడ్యూల్ లో వీరిద్దరు కూడా పాల్గొనబోతున్నట్లుగా మీడియా సర్కిల్స్ ద్వారా తెలుస్తోంది. రవితేజ ఇద్దరు మద్దుగుమ్మలతో రొమాన్స్ చేయబోతున్న ఈ సినిమా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే మాస్ ఎలిమెంట్స్ తో మాస్ మసాలా మూవీగా ఉంటుందని యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. ‘రాక్షసుడు’ బ్లాక్‌‌బస్టర్ తర్వాత రమేశ్‌ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్‌ 2న ప్రారంభం కానున్నట్లు సమాచారం.