Homeసినిమా వార్తలుపులిని వేటాడే పులి గా…మాస్ మహారాజ్ టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్..!!

పులిని వేటాడే పులి గా…మాస్ మహారాజ్ టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్..!!

Ravi Teja Tiger Nageswar Rao Motion Poster and first look out now details, Tiger Nageswar Rao Motion Poster, Tiger Nageswar Rao First look, Ravi Teja, Renu Desai, Ravi Teja new movie, Ravi Teja upcoming movies, Tiger Nageswar Rao release date,

Ravi Teja Tiger Nageswar Rao First Look: ఒక రెండు భారీ హిట్లు తర్వాత రావణాసుర సినిమాతో కాస్త వెనుక పడ్డ మాస్ మహారాజు రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ మూవీ తో ఎలాగైనా సక్సెస్ సంపాదించాలి అని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం రియల్ రాబిన్ హుడ్ గా గుర్తింపు పొందిన టైగర్ నాగేశ్వరరావు యొక్క జీవిత కథతో వంశీకృష్ణ ఆకెళ్ళ ఆవిష్కరిస్తున్నారు.

Ravi Teja Tiger Nageswar Rao First Look: తన సినీ కెరియర్ లో మొదటిసారిగా రవితేజ ఓ పిరియాడిక్ జోనర్ లో రియలిస్టిక్ మూవీలో నటిస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయి ఉంది. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి లాంచ్ చేసిన ఫస్ట్ లుక్ ప్రస్తుతం నెట్లో బాగా వైరల్ అయింది. పైగా ఈ లాంచ్ ను నార్మల్ రెగ్యులర్ పాటర్న్ లో కాకుండా వినూత్నమైన రీతిలో ఆవిష్కరించడం మరొక విశేషం.

ఏకంగా రాజమండ్రిలోని గోదావరి బ్రిడ్జి పైన ఎంతో ఆర్భాటంగా ఈ ఫస్ట్ లుక్ ను లాంచ్ చేసి అందరినీ షాక్ కి గురి చేశారు చిత్ర బృందం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. రాజమండ్రి రైల్వే బ్రిడ్జిపై వెళ్తున్న ట్రైన్ సడన్గా మధ్యలో ఆగిపోయి…అందులో నుంచి ఓ దొంగల గుంపు దిగుతుంది.. ఆ తర్వాత బ్రిడ్జి పైనుంచి టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ (Tiger Nageswar Rao First Look) బ్యానర్ ని ఆవిష్కరించారు.. అలాగే మూవీకి సంబంధించిన మొదటి ప్రోమో ని కూడా రిలీజ్ చేశారు.

Ravi Teja Tiger Nageswar Rao Motion Poster:

అది 70వ దశకం.. బంగాళాఖాతానికి తీర ప్రాంతంలో ఉన్న ఓ చిన్ని గ్రామం…ప్రపంచాన్ని భయపెట్టే చీకటి అక్కడ ఉన్న జనాల్ని చూసి భయపడుతుంది…దడ్ దడ్ అంటూ వెళ్లే రైలు కూడా ఆ ప్లేస్ కి రాంగానే గజగజ వణుకుతుంది.. ఆ ఊరు మైలురాయి కనపడితే జనం అడుగులు తడబడుతాయి…భారతదేశపు నేర రాజధాని.. ద క్రైమ్ క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఇండియా…స్టువర్టుపురం…ఆ ప్రాంతానికి మరో పేరే టైగర్ జోన్.. ది జోన్ ఆఫ్ టైగర్ నాగేశ్వరరావు. అంటూ ఇచ్చిన ఇంట్రో అయితే మాత్రం సినిమాపై ఇంట్రెస్ట్ ను ఓ రేంజ్ లో పెంచేసింది.

Ravi Teja Tiger Nageswar Rao Motion Poster and first look out now

దానికి తోడు ప్రోమో చివరిలో జింకను వేటాడే పులిని చూసుంటావు కానీ పులినే వేటాడే పులిని చూశావా అంటూ రవితేజ పంచ్ డైలాగ్ కిర్రాక్ గా ఉంది. ఈ ఒక్క డైలాగ్ తో సినిమాలో ఎలాంటి పంచ్ డైలాగ్స్ మరియు యాక్షన్ సీన్స్ ఉంటాయి అనే విషయం డైరెక్టర్ చెప్పకుండానే చెప్పాడు. ప్రోమోలో వాయిస్ ఓవర్, కానీ బ్యాక్ గ్రౌండ్ కానీ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఒక్క ప్రోమో ఇలా ఉంది అంటే టోటల్ సినిమా ఎలా ఉంటుంది అని అందరూ ఎక్సైటింగ్ గా ఉన్నారు.

Web Title: Ravi Teja Tiger Nageswar Rao Motion Poster and first look out now details, Tiger Nageswar Rao Motion Poster, Tiger Nageswar Rao First look, Ravi Teja, Renu Desai, Ravi Teja new movie, Ravi Teja upcoming movies, Tiger Nageswar Rao release date,

For the latest Telugu movie news, entertainment exclusives, gossip, movie reviews, and more, follow the Chitrambhalare website and YouTube channel, or head to our social media platforms like Twitter, Facebook, Instagram!

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY