డబుల్ రోల్ చేస్తున్న మాస్ మహారాజ్ రవితేజ

973
ravi-teja-to-play-Dual-role-in-ramesh-varma-movie
ravi-teja-to-play-Dual-role-in-ramesh-varma-movie

మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రవితేజ ఈ ఏడాది క్రాక్ సినిమాతో కెరీర్‌ బెగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం రవితేజ తన తాజాగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో డింపుల్ హయాతి, అమృతా అయ్యర్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.

 

 

అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సినీ సర్కిల్స్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది.  ఈ సినిమాలో రవితేజ రెండు పాత్రలు చేయనున్నారంట. తండ్రికొడుకుల పాత్రల్లో రవితేజ కనిపించనున్నారంట. ఈ సినిమాలో తండ్రి పాత్ర చనిపోయిన దగ్గర నుంచి కథ తిరిగే మలుపులు ఊహకు కూడా అందవంట.

 

 

అయితే తండ్రి కథను కొడుకు ఎలా ముగించాడు అన్నది సినిమా ప్లాట్ అని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్ కాబట్టే ఇద్దరు హీరోయిన్‌లను తీసుకున్నారంట. ఇదిలా ఉంటే క్రాక్ సినిమాతో రవితేజ కెరీర్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. దీంతో రవితేజ సినిమా అంటే ప్రేక్షకుల్లో తారాస్థాయి అంచానాలు ఉంటాయిని, వాటికి తగ్గట్టుగా మాస్ ఎలిమెంట్స్ నింపారంట దర్శకుడు. అంతేకాకుండా ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. మరి ఈ సినిమాతో మాస్ మహరాజ్ ఎంతటి హాట్ అందుకుంటారో వేచి చూడాలి.