Ravi Teja Upcoming Movies list: ఈ సంవత్సరం రవితేజకు బాగా అచ్చి వచ్చినట్లుగా ఉంది. ఇట్లు ఫ్రాకులు సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. ఒక సంవత్సరంలో కనీసం మూడు నాలుగు సినిమాలు రిలీజ్ చేయడమే లక్ష్యంగా ప్రస్తుతం రవితేజ పని చేస్తూ ఉండడం విశేషం. మంచి టాలెంట్ ఉన్న యంగ్ డైరెక్టర్స్ అయినా సరే కథ నచ్చితే మాత్రం వెంటనే రవితేజ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు.
Ravi Teja New movie Details: ఇప్పటికే ఎంతోమంది డైరెక్టర్స్ కు రవితేజ ఛాన్సల్ ఇచ్చి మంచి స్టార్ డైరెక్టర్ గా మార్చాలి. ఒకప్పటి పూరి జగన్నాథ్ నుంచి ఇప్పటి బాబీ గోపీచంద్ మలనేని వరకు రవితేజ మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన వారే. నిర్మాతలు కూడా రవితేజ తో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.
ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. స్టువర్టుపురం దొంగల నేపథ్యంలో సాగే ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ మూవీ తర్వాత కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్ లో రవి తేజ ఈగల్ మూవీ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తో పాటు మరో మూడు ప్రాజెక్టు లు రవితేజ తో నిర్మించడానికి పీపుల్స్ మీడియా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం రవితేజ కి 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ (Ravi Teja Remuneration) ఇవ్వడానికి ఈ సంస్థ ఒప్పందం కుదిరింది అని టాక్. ప్రస్తుతం రవితేజ తాను చేసే ప్రతి ప్రాజెక్టుకి సుమారు పాతిక కోట్ల వరకు రమ్నరేషన్ తీసుకుంటున్నారు. కాబట్టి నాలుగు చిత్రాలకు కలిపి 100 కోట్లు అందుకోబోతున్నాడు.

ఇక ఈగల్ మూవీ తర్వాత రవితేజ నెక్స్ట్ మూవీ కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ డైరెక్షన్లో తెరకెక్కనుంది. ఇప్పటికే ఏ మూవీకి సంబంధించిన స్టోరీ డిస్కషన్ పార్ట్ పూర్తి అయింది.. ఇక స్టోరీ రెడీ చేయడంలో దర్శకుడు బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటుగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక మూవీ మరియు ప్రసన్న కుమార్ బెజవాడ తో మరొక మూవీ లైన్ అప్ లో ఉన్నాయి. ఈ అన్ని సినిమాలను రెండు సంవత్సరాల టార్గెట్ తో పూర్తి చేసే విధంగా రవి తేజ ప్లానింగ్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.