shraddha kapoor, Prabhas, Saaho, Akshay Kumar, Mission Mangal
shraddha kapoorshraddha kapoor, Prabhas, Saaho, Akshay Kumar, Mission Mangal

సాహో సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా పెరుగుతున్నాయి.దానికి కారణం ఈ సినిమా ప్రమోషనల్ మెటీరియల్ లో కనిపిస్తున్న భారీ తనం మాత్రమే కాదు,ఈ సినిమాకి ఉన్న రేర్ స్పెషలిటీస్ కూడా.ముఖ్యంగా ఈ సినిమా బడ్జెట్.నిన్న మొన్నటివరకు ఈ సినిమాకు 300 కోట్ల బడ్జెట్ కేటాయించారు అని టాక్ నడించింది.కానీ ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 350 అని స్వయంగా ప్రభాస్ రివీల్ చెయ్యడంతో అంతా షాక్ అవుతున్నారు.

ఈ సినిమాలో చాలా భాగం రియలిస్టిక్ గా షూట్ చేసారు.కానీ మిగిలిన షూటింగ్ కోసం మళ్ళీ 70 సెట్స్ వేయడం,అబుదాబి చేజ్ కోసం 80 కోట్ల బడ్జెట్ కేటాయించడం వంటి విషయాలు సాహో పై అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి.రెండేళ్లుగా సాహో షూటింగ్ లో ఉంది అనేది అందరికి తెలిసిందే.కానీ ఇంత భారీ సినిమా కేవలం 227 రోజుల్లో పూర్తికావడం అనేది నిజంగా ఒక వండర్.దానికి కారణం ఈ సినిమా డైరెక్టర్ సుజీత్ క్లారిటీ అని ప్రభాస్ చెప్పడంతో ఒక్క సినిమా అనుభవం ఉన్న డైరెక్టర్ ఈ సినిమాని ఎలా డీల్ చేసి ఉంటాడు అన్న అనుమానాలకు కూడా తెరపడింది.ఇక ఈ సినిమా రిలీజ్ మాత్రం బాహుబలిని కూడా మించేలా ఉండబోతుంది.అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం చేస్తున్న ఖర్చు కూడా ఒక రికార్డ్ గా నిలవనుంది.

కోటి 70 లక్షల ఖర్చుతో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను రామోజీ ఫిలిం సిటీ లో జరపబోతున్నారు.ఈ సినిమా కోసం ప్రభాస్ అండ్ టీమ్ మొత్తం ఇండియా మీడియాకి అందుబాటులోకి రానుంది.తెలుగు,తమిళ్,మలయాళీ,హిందీ మీడియాలకు సెపరేట్ గా డేట్స్ కేటాయించి మరీ ఇంటర్వూస్ ప్లాన్ చేసారు.దీంతో సాహో రేంజ్ సినిమాకి ఎలాంటి హైప్ ఉండాలో అలాంటి హైప్ దక్కుతుంది.ఇక ఈ సినిమా యూనిట్ కేవలం యాక్షన్ అదిరిపోతుంది అని కాకుండా ఈ సినిమా కథ,స్క్రీన్ ప్లే గురించి ఎక్కువగా మాట్లాడుతుండడం కూడా సాహో పై అంచనాలు పెంచుతుంది.ఓవర్ ఆల్ గా సాహో ఒక మాగ్నమ్ ఒపస్ మూవీ అని రిలీజ్ ముందే ఫిక్స్ అయిపోతున్నారు అంతా.