reason behind allu arjun ala venkatapuramlo teaser postponed
reason behind allu arjun ala venkatapuramlo teaser postponed

‘అల.. వైకుంఠపురంలో’ నుండి ఇప్పటిదాకా చిన్న చిన్న అప్డేట్స్.. మూడు లిరికల్ సాంగ్స్ విడుదల అయ్యాయి. టీజర్ ఎప్పుడు వస్తుందా అని అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 8 ఉదయం 10 గంటలకు టీజర్ విడుదల కానున్నట్లు గతంలో ప్రకటించారు. అనుకున్న సమయానికి టీజర్ రెఢీ అయ్యింది. కానీ విడుదల మాత్రం పోస్ట్ పోన్ చేసింది చిత్ర యూనిట్. దీనికి వేరే కారణం ఉన్నట్లు తెలుస్తోంది.

అల వైకుంఠపురం లో టీజర్ వాయిదా వేసింది గీత ఆర్ట్స్. దానికి కారణం గ్రేటర్ హైదరాబాద్ మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నూర్ బాయ్ మృతి చెందడం. మెగా హీరోలు అభిమానులు ఆయన మృతికి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యుల్లో ఒకరైన నూర్ భాయ్ మరణం కలిచివేసింది. ఇటువంటి విషాద సమయంలో అల వైకుంఠపురం లో టీజర్ను విడుదల చేయడం సరైందికాదని భావించినట్లు తెలుస్తోంది. సోమవారం నాడు చిన్న గ్లిమ్ప్స్ లాంటిది వదిలిన గీతా ఆర్ట్స్ టీమ్.. టీజర్ ను డిసెంబర్ 11న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా అల వైకుంఠపురం లో కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ భారీ విజయాలను సొంతం చేసుకోవడంతో ఈ సినిమా పైనా అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి.

మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు నూర్‌ అహ్మద్‌(55) ఆదివారం నాడు గుండెపోటుతో మృతి చెందారు. ఈ వార్త తెలిసి మెగాస్టార్ చిరంజీవి కూడా ఎంతో బాధను వ్యక్తం చేశారు. మోండా మార్కెట్‌లో తమల పాకుల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న నూర్‌ మహ్మద్‌ చిరంజీవికి వీరాభిమాని. చిరంజీవి కుటుంబసభ్యుల చిత్రాల విడుదల అంటే ఆయన ఇంట్లో పండుగ.. అలాంటి వ్యక్తి మరణించాడని తెలుసుకున్న మెగా ఫ్యామిలీ అభిమానులు పెద్ద సంఖ్యలో న్యూబోయిగూడలోని ఆయన ఇంటికి తరలి వచ్చారు. చిరంజీవి, అల్లు అర్జున్‌, నిర్మాత అ‍ల్లు అరవింద్‌ నూర్‌ అహ్మద్‌ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.