అర్జున్ రెడ్డి సినిమాతో ఫేమస్ అయిన విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఆ తర్వాత టాలీవుడ్ అలాగే బాలీవుడ్ లోనూ ప్రతి ఒక్క హీరోయిన్ తన అందానికి నటనకి అట్రాక్ట్ అయ్యారు. విజయ్ దేవరకొండ తో ఒక్కసారైనా డేట్ కి వెళ్లాలని చాలామంది హీరోయిన్స్ చూస్తున్నారు.
లైగర్ సినిమాతో ఫ్యాన్ ఇండియా స్టార్డం తెచ్చుకున్న విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అలాగే యాంకర్ అనసూయ (Anasuya) మధ్య కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న గొడవలు బహిరంగంగానే అందరికీ తెలిసిందే. ఛాన్స్ దొరికినప్పుడల్లా అనసూయ తన సోషల్ మీడియా ద్వారా విజయ్ పై ఆరోపణలు చేస్తూనే ఉంటుంది.
అర్జున్ రెడ్డి సినిమా టైంలో అమ్మాయిల గురించి అలాగే వాళ్ళ వ్యక్తిత్వాలు గురించి విజయ్ చేసిన కామెంట్స్ ఏ దీనికి దారితీసాయని చాలామంది అంటున్నారు. ఆ టైంలో ఇద్దరు సోషల్ మీడియాలోనే కాకుండా వెబ్ మీడియాలో కూడా వీటి గురించి చర్చించడం మనం చూశాము. రీసెంట్ గా విజయ్ ఖుషి సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్ పోస్టర్ విడుదలైన తర్వాత కూడా అనసూయ The ది అంటూ పరోక్షంగా విజయ్ (Vijay Devarakonda) ని టార్గెట్ చేయడం మనం చూసాము. అయితే విజయ్ మాత్రం ఎప్పుడు వీటి మీద స్పందించిన దాఖలాలు లేవు. ఫ్యాన్స్ మాత్రం అనసూయని (Anasuya) ఒక రేంజ్ లో ఆంటీ అంటూ కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేసేవారు.
అయితే దీనికి మించిన ఇంకో గొడవ ఉంది అని సోషల్ మీడియాలో న్యూస్ హల్చల్ చేస్తుంది. అది ఏమిటంటే యాంకర్ అనసూయ భర్త భరద్వాజ్ అలాగే విజయ్ దేవరకొండ ఒక పార్టీలో చాలా పెద్ద గొడవ అయిందని.. ఈ గొడవ కారణంగానే అనసూయ విజయ్ దేవరకొండ పై రివెంజ్ తీర్చుకోవాలని తన సోషల్ మీడియా ద్వారా ఇలా చేస్తుందని న్యూస్ అయితే ప్రచారంలో ఉంది. అలాగే ఫ్యాన్స్ కూడా విజయ్ సైలెంట్ గా ఉంటున్నాడని ఎలా పడితే అలాగా పోస్ట్లు పెడితే ఊరుకునేది లేదని.. విజయ్ రంగంలోకి దిగితే శీను వేరే లాగా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి వీళ్ళిద్దరి గొడవకి ఎప్పుడు పులిస్టాప్ పడుతుందో చూడాలి.
Web Title: Anchor Anasuya and Vijay Devarakonda fight, reason behind Anasuya and vijay devarakonda fight, Anasuya husband bharadwaj, Anasuya vs Vijay Devarakonda