Reason Behind DSP Walkout from Valmiki Movie
Reason Behind DSP Walkout from Valmiki Movie

DJ…దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంది అనేది ఇప్పటికే ఒక మిస్టరీనే.దానికి కారణం కూడా అందరికి తెలిసిందే.సినిమా మామూలుగా తీసిన హరీష్ శంకర్ దాని రిజల్ట్ మాత్రం సూపర్ అని చెప్పుకోవడం దానికిపడిన కౌంటర్స్…చాలా పెద్ద రచ్చే నడిచింది.

అయితే ఆ ఎఫెక్ట్ నుండు బయటపడి, తనకు అచొచ్చిన రీమేక్ కథ మళ్ళీ హిట్ ఇస్తుంది అని వాల్మీకి సినిమా స్టార్ట్ చేసాడు.అయితే హరీష్ శంకర్ కి ఇప్పుడు అసలు టెస్టింగ్ టైం మొదలయ్యింది.అతని మార్కెట్ ప్రకారం అన్ లిమిటెడ్ బడ్జెట్ ఇవ్వలేరు.దాంతో మహర్షి హిట్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న పూజ హెగ్డే వాల్మీకి టీమ్ కి డేట్ సాకుగా చూపించి తప్పుకుంది.ఇక దేవీ శ్రీ ప్రసాద్ తప్పుకోవడానికి అసలు కారణం అతను ఒక రీమిక్స్ సాంగ్ చెయ్యను అని చెప్పడం ,హరీష్ చెయ్యాల్సిందే అని పట్టుబట్టడం అని ఒక న్యూస్ సర్కులేట్ అవుతుంది.

అయితే దేవీ ఎగ్జిట్ కి అది ఒక కారణం మాత్రమే.వాల్మీకి కి దేవీ రెమ్యునరేషన్ కూడా సంతృప్తికరంగా లేదు,హరీష్ మాత్రం కావాల్సిన అవుట్ ఫుట్ వచ్చేవరకు వదిలిపెట్టడు…అందుకే దేవీ కూడా ఆ రీమిక్స్ పాటను సాకుగా చూపి ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు,ఆ ప్లేస్ లో రెమ్యునరేషన్ పరంగా కూడా కంఫర్టబుల్ అయిన మిక్కీ ప్రాజెక్ట్ లోకి వచ్చాడు అని ఫిల్మ్ నగర్ లో మాట్లాడుకుంటున్నారు.దీంట్లో ఎంత నిజం ఉంది అనేది పక్కనబెడితే దిల్ రాజు కాంపౌండ్ నుండి బయటికి వచ్చిన హరీష్ శంకర్ కి చుక్కలు కనిపిస్తున్నాయి అనేది మాత్రం నిజం.మరి వాల్మీకి హరీష్ కి ఎలాంటి రిజక్ట్ అందిస్తుందో,కొత్తగా ప్రారంభం అయిన 14 రీల్స్ ప్లస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడాలి.