Prabhas The Raja Saab Postponed: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసింది.. కల్కి, సలార్ భారీ విజయం తర్వాత ప్రస్తుతం దర్శకుడు మారుతి, హను రాఘవపూడి, ప్రశాంత సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఫౌజీ సినిమా షూటింగ్ సెట్లో కాలుకి గాయం కావడంతో ప్రస్తుతం రెస్ట్ మూడ్లో ఉన్నారు. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు మారుతి దర్శకత్వం వహిస్తున్న ది రాజా సాబ్ మూవీ పోస్ట్ ఫోన్ (The Raja Saab Postponed) చేసినట్టు తెలుస్తుంది.
Prabhas Movies: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ది రాజా సాబ్ (The Raja Saab) మూవీ ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధం చేశారు మేకర్స్.. ఇప్పటికే ఈ సినిమా నుండి పోస్టర్లు అలాగే టీజర్ ని విడుదల చేయడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకి హైలెట్ గా విజువల్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి.. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన టాకీ పూర్తి అయినట్టు తెలుస్తుంది. సోషల్ మీడియా ప్రకారం ఈ సినిమాని ఏప్రిల్ 10 నుండి వేరే రిలీజ్ డేట్ కి మార్చినట్టు ప్రచారం అయితే నడుస్తుంది.. అయితే దీనిపై ఇంతవరకు అఫీషియల్ గా ఎటువంటి ప్రకటన అయితే రాలేదు.
ప్రభాస్ (prabhas) కి గాయం కావడంతో షూటింగ్ డిలే అవుతుంది అని ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసినట్టు సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. దానితోపాటు హైలెట్గా చెబుతున్న VFX వర్క్ కూడా అనుకున్న టైం కి పూర్తి కాదని.. అలాగే మరో మూడు పాటలు షూటింగ్ చేయాల్సి చేయాల్సి ఉంది అంట.. అలాగే సోర్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ సినిమాలకు సంబంధించిన షూటింగ్ అన్ని జనవరి 2025 తర్వాతే మళ్ళీ మొదలు పెడతారని చెబుతున్నారు..
ది రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ రెండు గెటప్పుల్లో కనపడబోతున్నారు.. దీనికి సంబంధించిన పోస్టర్లు కూడా ప్రభాస్ పుట్టిన రోజున విడుదల చేయడం జరిగింది. అయితే బాక్స్ ఆఫీస్ కింగ్ గా ఉన్న ప్రభాస్ వరుస సినిమాలు పోస్ట్ పోన్ జరుగుతూ వస్తున్నాయి. దాదాపుగా 8 సినిమాలు అంటే మిర్చి సినిమా నుండి లేటెస్ట్ రాజా సాబ్ సినిమా వరకు ఏది ప్రకటించిన రిలీజ్ డేట్ కి విడుదల కాలేదు. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం తన హవాని చూపిస్తున్నారు ప్రభాస్.