సన్ NXT, NETFLIX లో స్ట్రీమింగ్ అవుతున్న రామ్ ‘రెడ్’ సినిమా

115
RED-Movie-streaming-on Sun Nxt-Netflix
RED-Movie-streaming-on Sun Nxt-Netflix

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ ఇటీవల విడుదల చేసిన సినిమా రెడ్. ఈ సినిమాలో రామ్ రెండు పాత్రల్లో కనిపించి అందరినీ అలరించారు. ఇందులో మాళవిక శర్మా, అమృత అయ్యర్ హీరోయిన్‌లుగా నటించారు. రామ్ కెరీర్ ప్రారంభంలో హిట్‌లు అందుకున్న తరువాత వరుస ప్లాప్‌లు చవిచూశారు. ఆ తరువాత మాస్ దర్శకుడు పూరి డైరెక్షన్‌లో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కారు.

ఆ తరువాత కిషోర్ తిరుమల దర్వకత్వంలో రామ్ తెరకెక్కించిన సినిమా రెడ్. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ మరియు సన్ NXT భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అయితే ఈ సినిమాను ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ మరియు సన్ NXT లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా రామ్ కెరీర్‌లో ఎంతో ప్రతిస్టాత్మకంగా రూపొందిచారు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూసారు