‘టక్ జగదీశ్’లో గుమ్మడి వరలక్ష్మి పాత్రలో రీతువర్మ

217
Ritu Varma Character in Tuck Jagdeesh
Ritu Varma Character in Tuck Jagdeesh

హైదరాబాద్ లో పుట్టి పెరిగిన రీతువర్మ ఇప్పుడు తెలుగులోనే కాదు తమిళంలోనూ చక్కని పాత్రలు చేస్తూ పేరు సంపాదించుకుంటోంది. ‘పెళ్ళిచూపులు’ సినిమాతో ఉత్తమ నటిగా నంది అవార్డును సొంతం చేసుకున్న రీతువర్మకు తమిళ వెబ్ సీరిస్ ‘పుత్తం పుది కాలై’ చక్కని గుర్తింపును తెచ్చి పెట్టింది.

 

 

ఇటీవల ఆమె నటించిన ‘నిన్నిలా నిన్నిలా’ మూవీ జీ5లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మార్చి 10 రీతువర్మ పుట్టిన రోజు. 31 సంవత్సరాలు పూర్తి చేసుకుని 32వ యేడులోకి అడుగుపెడుతోంది ఈ టాలెంట్ యాక్ట్రస్. ప్రస్తుతం తెలుగులో రీతు మూడు సినిమాల్లో నటిస్తోంది. నేచురల్ స్టార్ నాని సరసన ‘టక్ జగదీశ్’లో గుమ్మడి వరలక్ష్మి పాత్రలో రీతు కనిపించబోతోంది.

 

 

అలానే నాగశౌర్య కథానాయకుడిగా సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ‘వరుడు కావలెను’లో రీతు హీరోయిన్ గా చేస్తుంది. శర్వానంద్ హీరోగా ఇంకా పేరు నిర్ణయించని ద్విభాషా చిత్రంలోనూ ఆమె కథానాయిక. ఇంతవరకూ చేసింది తక్కువ సినిమాలే అయినా… తన పాత్రకు ప్రాధాన్యం ఉంటే… ఏ మీడియంలో అయినా నటించడానికి రీతు వెనుకాడదు. అదే ఆమెకు నటిగా చక్కని పేరు రావడానికీ కారణమైంది. మరిన్ని మంచి పాత్రలతో ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకోవాలని కోరుకుందాం.