సైంటిస్టుగా రెజీనా నేనే నా.. త్వరలోనే ట్రైలర్‌..!

0
120

ఎవరు సినిమా త‌ర్వాత టాలీవుడ్ భామ రెజీనా తెలుగు, త‌మిళ భాష‌ల్లో న‌టిస్తున్న చిత్రం నేనే నా. నిను వీడ‌ని నీడ‌ను నేనే ఫేం కార్తీక్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. లేడీ ఓరియెంటెడ్ స్టోరీతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆపిల్ ట్రీ స్టూడియోస్ బ్యాన‌ర్ పై రాజ‌శేఖ‌ర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చివ‌రి ద‌శ‌లో ఉన్నాయి.

ఎంటర్‌టైన్‌మెంట్, సూపర్‌ విజువల్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతినిస్తుంది. ఇందులో రెజీనా పురావస్తు శాస్త్రవేత్త పాత్రలో కనిపిస్తారు. రెజీనా ఏం పరిశోధిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. మా సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. నేనే నా థ్రియాట్రిక‌ల్ ట్రైల‌ర్ ను త్వ‌ర‌లోనే విడ‌ద‌ల చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. హార్ర‌ర్ మిస్ట‌రీగా తెర‌కెక్కుతున్న ఈ ప్రాజెక్టుకు శ్యామ్ సీఎస్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. కాగా గోకుల్ బెనోయ్ సినిమాటోగ్ర‌ఫీ.

రెజీనా మ‌రోవైపు ‘శాకిని ఢాకిని’ చిత్రంలో కూడా న‌టిస్తోంది. నివేదా థామ‌స్ ఈ సినిమాలో మ‌రో లీడ్ రోల్ చేస్తోంది. కొరియన్ మూవీ ‘మిడ్‌ నైట్‌ రన్నర్స్‌’కి రీమేక్‌గా యాక్షన్‌ థ్రిల్లర్ జోన‌ర్ లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని సుధీర్‌ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు.

Regina Cassandra's Nene Naa movie poster

Previous articleRegina Cassandra’s “Nene Naa” Trailer Out Soon
Next articlePragya Jaiswal Hot Collections