పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” క్రేజీ అప్‌డేట్‌ అదుర్స్‌

0
3958
Release date locked for Pawan Kalyan's Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu Release Date: పవర్‌స్టార్‌ అభిమానులకు మరో స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ నుంచి పుట్టినరోజు కానుక విడుదలైంది. పవన్‌ 50వ పుట్టినరోజుని పురస్కరించుకుని గురువారం మధ్యాహ్నం చిత్రబృందం ఈ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఈ చిత్రం తాలూకా సరికొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసేసారు.

ఈ చిత్రాన్ని ఇప్పుడు వచ్చే ఏడాది ఏప్రిల్ నెల 29న రిలీజ్ చేస్తున్నట్టుగా అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. మొత్తానికి మాత్రం పవన్ నుంచి వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లోనే డబుల్ ట్రీట్ అని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా లెజెండరీ సంగీత దర్శకులు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మొఘల్‌ సామ్రాజ్యం పాలన బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో ఔరంగజేబు చెల్లెలి పాత్రలో బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కనిపించనున్నారు. అలాగే, ఔరంగజేబు పాత్రలో అర్జున్‌ రాంపాల్‌ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే విడుదలైన ‘భీమ్లానాయక్‌’ ఫస్ట్‌ సింగిల్‌ విశేషంగా అలరిస్తోన్న విషయం తెలిసిందే.  

Hari Hara Veera Mallu theatrical release on 29 April 2022

 

 

Previous articleవిచారణకు హాజరైన ఛార్మి..!
Next articlePawan Kalyan’s Bheemla Nayak title song out now.