రేణు దేశాయ్, అకీరా లకి కరోనా..!

Renu Desai And Son Akira Nandan: దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తుంది. ఓమిక్రాన్ వేరియంట్లో ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్త వహించాలి అని సూచిస్తుంది. ఇప్పటికే సినీ సెలబ్రిటీస్ చాలా మంది ఈ వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో అయితే చెప్పలేని విధంగా వరుసగా మహేష్ బాబు, మంచు లక్ష్మి, నితిన్ వైఫ్, ఇలా చాలా మందికి ఈ వైరస్ సోకింది. అయితే ఇదిలా ఉండగా ఇప్పుడు మరో బ్యాడ్ న్యూస్ తెలిసింది.

పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్, కుమారుడు అకీరా నందన్ ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఈ విషయాన్ని రేణు తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ప్రకటించింది. ఆమె ఇలా వ్రాసింది, “థర్డ్ వేవ్ పరిస్థితులు భయానకంగా ఉన్నాయంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కువ సమయం తామిద్దరం ఇంట్లోనే ఉన్నామని, అయినప్పటికీ.. వైరస్ దాడి చేసిందని చెప్పారు.

ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌ను ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా.. అది తమపై దాడికి దిగుతుందని హెచ్చరించారు.” ఇది బాధాకరం అని చెప్పాలి. రేణు, అకీరా త్వరగా కోలుకోవాలని అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రార్థిస్తున్నారు. మరి అకీరా త్వరగా కోలుకోవాలని మా చిత్రంభాలరే యూనిట్ కోరుకుంటుంది.

Related Articles

Telugu Articles

Movie Articles