పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితమే. పెళ్లయిన తర్వాత సినిమాలు నుండి తప్పకుండా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు. తన అభిప్రాయాలను అలాగే వ్యక్తిగత సూచనలని సోషల్ మీడియా ద్వారా ఫాన్స్ కి అందించేవారు. లేటెస్ట్గా అందుతున్న సమాచారం మేరకు రేణు దేశాయ్ ప్రభుత్వం చేస్తున్న పనికి వ్యతిరేకంగా కోర్టు మెట్లు ఎక్కినట్టు తెలుస్తుంది.
ఇక విషయంలోకి వెళ్తే రేణు దేశాయ్ తో పాటు మరికొంతమంది సినీ సెలబ్రిటీసు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పనికి వ్యతిరేకంగా నిన్న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం నగర శివారులో కొత్వాల్ గూడాలో ఆక్వా మెరైన్ పార్క్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనివలన ప్రకృతి విధ్వంసం జరగటమే కాకుండా తీసుకువస్తున్న జీవరాసులు కూడా చాలా ఇబ్బందులు పడతాయంటూ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది.
రేణు దేశాయ్ తో పాటు డైరెక్టర్ శశి కిరణ్ తిక్క, హీరోయిన్ శ్రీదివ్య , సదా తదితరులు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకొని హైకోర్టుని ఇది ఆపాలి అంటూ ఆశ్రయించారు. జూన్ 27న కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటీషన్‌ను న్యాయస్థానం అంగీకరించింది. ఆక్వా మెరైన్ పార్కు వల్ల వేలాది జలచరాల ఇబ్బంది పడటంతో పాటు నీటి సమస్య కూడా వస్తుందంటూ ఈ పిటిషన్ లో వెల్లడించారు.

ఈ ఆక్వా మెరైన్ పార్కు కి దాదాపుగా వేల గ్యాలన్ల నీళ్లు కావాల్సి వస్తాయి.. ఈ నీటిలో కృత్రిమంగా ఏర్పాటు చేసిన లైట్స్ లో అవి జీవించటం చాలా ఇబ్బంది పడతాయి అంటూ పేర్కొన్నారు. మరి దీనిపై హైకోర్టు స్పందించి తీర్పు ఎలా ఇస్తుందో చూడాలి.